సాయం వద్దు.. విత్ డ్రా చేసుకోనివ్వండి చాలు: వైరలైన మాజీ సైనికుడు nand lal refuses helping hands, says let me withdraw my money

I get pension don t need anyone else s money face of cash woes refuses help

Demonetisation, Gurgaon, Old man breaks down outside bank, Viral photo, Old man crying in bank, Cash withdrawal, 50 days of demonetisation, Long queues at banks, Long queues at ATMs, Elderly man crying, Gurgaon bank, Social media, Hardships faced by people, Old man crying, Heart wrenching, Helplessness, Poor, Farmers, Daily wage workers, Crying for own money, Narendra Modi, Black money, Demonetisation woes

Nand Lal(79) former army jawan, who teared up outside a SBI branch in Gurgaon after spending hours trying to withdraw money after demonetisation, says he does not need any helping hands as he got his pension money

సాయం వద్దు.. విత్ డ్రా చేసుకోనివ్వండి చాలు: వైరలైన మాజీ సైనికుడు

Posted: 12/17/2016 11:02 AM IST
I get pension don t need anyone else s money face of cash woes refuses help

పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఒక్కసారిగా కరెన్సీ ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడటంతో తొలుత కొన్న రోజులు సేవలందించిన ఏటీయం సెంటర్లు కూడా వెక్కిరించడం ప్రారంభించగానే.. బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిల్చునేందుకు పోటీపడుతూ వస్తున్న జనం.. ఒక్కసారిగా తోసుకోవడంతో క్యూ లైను నుంచి బయటపడిన ఓ పెద్దాయన.. తనను లైనులోంచి తోసేసారని, తన స్థానం ఎక్కడో చెప్పాలని అర్థిస్తూ.. క్యూలో నిల్చున్న తోటివారిని అడుగుతూ.. అందుకు బదులు రాకపోవడంతో చేసేది లేక అలానే అర్థిస్తూ విలపించిన పెద్దాయన.. మాజీ సైనికుడు.. గుర్తున్నాడు కదూ.. అతనే నందూలాల్.  

పెద్దనోట్ల రద్దుతో కేవలం నల్లధన కుబేరులను మాత్రమే ఏడిపిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు.. నీటీమూటలుగానే మారుతున్నాయని, అయతే క్యూలైన్లో వేచివున్న పేదలు, సామాన్యులు. దినసరి కూలీలు, కార్మికులు రైతులు, కార్మికులు, కర్షకులు మాత్రమే అటు విదులకు వెళ్లలేక, క్యూ లైన్లలో తమకు అవకాశం వస్తుందో రాదో తెలియక.. మరుసటి రోజు ఆ పై మరుసటి రోజు.. ఇలా అనేక పర్యయాలు.. అయినా బ్యాంకు అధికారులు తమకు కావాల్సినంత కాకుండా వారు నిర్ధేశించినంత మాత్రమే డబ్బును ఇవ్వడంతో ఏడుస్తున్నదెవరు..?

తమ డబ్బులను తాము డ్రా చేసుకోలేని దర్భుర పరిస్థితులకు మూలం ఎవరు..? తమ ఖాతాలో డబ్బులున్నా.. తీసుకుని చూసుకోలేని పరిస్థితులకు దుర్భర స్థితికి అజ్యం పోసిందెవరు..? అంటూ పత్రికలలో అనేక కథనాలు వస్తున్న నేపథ్యంలో నందూలాల్  అవేదన మాత్రం యావత్ దేశప్రజలను కుదిపేసింది. అటు సోషల్ మీడియాలోనూ ఇటు ప్రతికలలోనూ దేశ ప్రజలందరికీ పరిచయమైన నందూలాల్ వయస్సు సుమారు 79 ఏళ్లు. ఈ వయస్సులోనూ తనకు ప్రజల నుంచి వస్తున్న విరాళాలను తీసుకోకుండా తనకు తన పెన్షన్ డబ్బులు వచ్చాయని.. ఇక తనకు ఎవరి సాయం అవసరం లేదని చెప్పాడు. తనలోని ఔనత్యాన్ని, అత్మాభిమానాన్ని మరోమారు చాటుకున్నాడు.

ఎండ, వాన, చలి అన్ని వేళల్లో.. జమ్మూకాశ్మీర్, సహా పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో దేశానికి సేవలందించిన యోధుడు.. చేచి చాచి తీసుకోవడమంటే తన ఆత్మాభిమానాన్ని కొల్పోవడమేనని భావించాడేమో అందుకనే అతనికి సాయం చేస్తామన్న చేతులను వద్దన్నాడు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఢిల్లీ హర్యానా విభాగం అధ్యక్షుడు కల్నల్ (రిటైర్డ్) అజిత్ సింగ్ రాణా వచ్చి సాయం చేస్తానని చెప్పినా తన నిర్ణయానికి తాను కట్టుబడ్డాడు. తన పెన్షన్‌ను తనకు వచ్చిందని.. అందుచేత తనకు ఎవరి సాయం వద్దని చెప్పాడని రాణా తెలిపారు. దాదాపు 30 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఒక పాపను దత్తత తీసుకుని అమెను పెంచి పెద్ద చేసి పెళ్లీడు రాగానే వివాహం చేసి పంపాడని, తన దత్తాకూతరు వారింటికి రమ్మని ఎన్నిసార్లు అర్థించినా తన ఆత్మభిమానం దెబ్బతింటుందని నందులాల్ వెళ్లలేదని స్థానికులు తెలిపారు.

అయితే తన పెన్షన్ తనను ఎందుకు విత్‌డ్రా చేసుకోలేనని నందలాల్ ప్రశ్నించారు. పెద్దనోట్లు రద్దు చేసే ముందు ప్రభుత్వం.. ముందస్తు చర్యలు తీసుకోకపోతే.. ప్రజలు ఇళ్లు వాకిల్లు వదలి బ్యాంకులు, ఏటీయంల వద్ద క్యూలైన్లలో వేచి వుండాలా అని నిలదీశారు. కాగా నందులాల్ వెళ్లిన స్టేట్ బ్యాంకు మేనేజర్ రఘువీర్ సింగ్ రాణా మాత్రం.. ఇప్పటికే ఆయనకు ఒకసారి రూ. 10 వేలు, మరోసారి రూ. 5వేలు ఇచ్చామని అన్నారు. ఇటు మీడియా, అటు సోషల్ మీడియాలో నందులాల్ హైలైట్ కావడంతో బ్యాంకు అధికారులు అయనకు అక్రాస్ ది కౌంటర్ సేవలందించేందుకు సిద్దమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : old man  retired army person  retired soilder  nand lal  sbi bank  gurgoan  social media  delhi  

Other Articles