పెద్దలు హ్యాపీ.. పేదల్ని, వయోవృద్దులను ఏడిపిస్తున్న సర్కార్ Old man breaks down outside bank

Demonetisation woes a retired armyman in tears touches a raw nerve

Demonetisation, Gurgaon, Old man breaks down outside bank, Viral photo, Old man crying in bank, Cash withdrawal, 50 days of demonetisation, Long queues at banks, Long queues at ATMs, Elderly man crying, Gurgaon bank, Social media, Hardships faced by people, Old man crying, Heart wrenching, Helplessness, Poor, Farmers, Daily wage workers, Crying for own money, Narendra Modi, Black money, Demonetisation woes

Nand Lal(78) tearing up outside a SBI branch in Gurgaon who have spent hours trying to withdraw or deposit money after the government’s move to recall high-value banknotes.

పెద్దలు హ్యాపీ.. పేదల్ని, వయోవృద్దులను ఏడిపిస్తున్న సర్కార్

Posted: 12/15/2016 09:45 PM IST
Demonetisation woes a retired armyman in tears touches a raw nerve

పెద్దనోట్ల రద్దుతో దేశంలో పెద్దమనుషుల్లా చెలామణి అవుతున్న నల్లకుభేరులు విలపిస్తున్నారని, అవినీతికి పాల్పడే అక్రమార్కులు తాట తానంతట తానే ఊడిపోతుందని ప్రభుత్వం చెబుతున్న మాటలు.. అధికారపక్ష నేతలు చేస్తున్న ప్రసంగాలకు వాస్తవ పరిస్థితులకు ఏక్కడా పోంతన లేకుండా పోతుంది. నల్లకుబేరుల ఇంటికి కొత్త నోట్ల కట్టలు కుప్పులు తెప్పలుగా వక్రమార్గంలో పోతున్నాయి.

ఇలా డబ్బులు బ్యాంకు అధికారులో, ప్రబుత్వ అధికారులో అందిస్తుంటే.. ఏ నల్లకుభేరుడు పేదల ఇళ్ల వద్దకు వచ్చి డబ్బిచ్చి తమ అకౌంట్లో వేసుకోమ్మని అర్థిస్తాడు. ఇలా ఎవరైనా డబ్బిస్తే వాటిని తిరిగి చెల్లించకండీ అని పాలకులే మరోమారు పేదల జీవితాల్లో అశలు రేపుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చి అప్పుడే రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు జన్ ధన్ ఖాతాల్లో 15 లక్షల రూపాయలలో చిల్లి గవ్వ కూడా రాలేదు.

ఇలా చెప్పి ఓ సారి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన పెద్దలు మరోసారి కూడా పేదలను చిన్న చిన్న అశల వలయంలో చిక్కుకునేలా చేసి.. అసలు సమస్యను అత్యంత చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అవసరాలకు డబ్బులు లేక.. వాటిని పోందేందుకు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ.. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితులు సామాన్యులకు ఉత్పన్నమవుతున్నాయి.

న్యూఢిల్లీలోని గుర్గావ్ లో ఓ 79 ఏళ్ల రిటైర్డు ఆర్మీ వ్యక్తి (మాజీ సైనికుడు) తన డబ్బుల కోసం ఇలా ప్రయాసపడాల్సి వచ్చింది. అంతలో తన స్థానం గల్లంతై.. తనను క్యూ నుంచి తోసేయడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. అతడి అరణ్యరోదన ఇప్పుడు ఆన్‌లైన్‌లో నెటిజన్లను కదిలిస్తోంది. బ్యాంకుల ముందు సామాన్యల కష్టాలకు ఈ ఫొటో దర్పణం పడుతోంది. ఈ ఫోటో కాస్తా వైరల్ గా మారడంతో.. నెట్ జనులు తమ కామెంట్లను పోస్టు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : old man  retired army jawan  Nand Lal  bank  sbi  queue  gurgaon  social media  

Other Articles