హైవేలలో మద్యం దుకాణాలపై సుప్రీం కీలక అదేశాలు No liquor to be sold on highways from now on, Supreme Court orders

No liquor to be sold on highways from now on supreme court orders

Liquor Shops, Wine Shops, Bar and Rstarants, Highways, supreme court, sc, sc ruling, sc judgement, supreme court liquor ruling, liquor shops ruling, liquor shops selling ruling, supreme court verdict, sc verdict, india news

Supreme Court ordered closure of all liquor shops along national and state highways. A bench led by Chief Justice T S Thakur directed the Central and state governments to “cease and desist” from issuing liquor licenses.

లాంగ్ రైడ్ లో థ్రిల్ అండ్ చిల్ కు చెల్లుచీటి

Posted: 12/15/2016 12:57 PM IST
No liquor to be sold on highways from now on supreme court orders

స్నేహితులతో కలసి మీ కారులో హాలీడే ట్రిప్ వెళ్ధామని ప్లాన్ చేసుకున్నారా..? దారి వెంట వెళ్తూ వెళ్తూ కాస్తా చిల్ అవుదామని అనుకుంటున్నారా..? మార్గమధ్యంలో మీ తెలిసిన బార్ వుందా..? అయినా ఇక మీ ఎంజాయ్ మెంట్ కు చీటీ చెల్లనుంది. రోడ్డు ప్రమాదాలు సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలను తీసుకోని తరుణంలో వాటిపై అప్రమత్తంగా వుండాలని అదేశించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంలో కీలక అదేశాలను జారీ చేసింది.

మద్యం దుకాణాలను కేవలం అదాయ వనురుగానే చూసే రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టులా పరిణమించనుంది. ప్రజారోగ్యం, ప్రమాదాల నివారణ నేపథ్యంలో న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు అదాయాన్ని కొంతమేరకు హరించే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుతో ఇకపై జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వున్న మద్యం దుకాణాలు, బార్ షాపులను తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం అదేశాలను జారీ చేసింది.

వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి జాతీయ, రాష్ట్రాల హైవేల పక్కన మద్యం షాపులను నిర్వహించరాదని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న షాపుల లైసెన్సులను రెన్యూవల్‌ చేయరాదని సుప్రీం కోర్టు సూచించింది. జాతీయ, రాష్ట్రాల హైవేలకు మద్యం షాపులు కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలని స్పష్టం చేసింది. హైవేల పక్కన మద్యం అమ్మకాల వల్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా మద్యం షాపులను మూసివేయాలని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wine shops  Liquor Shops  Bar and Rstarants  Highways  Supreme Court  

Other Articles