అర్హత లేకున్నా క్రెడిట్ కార్డులు మీ సొంతం.. | State Bank of India provide new credit cards without Credit card history.

Sbi brings new credit cards

State Bank of India, SBI Credit Cards, State Bank of India Cards, State Bank of India Debit cards, SBI Credit and Debit Cards, SBI 25000 Credit Cards, Credit Card rules in India, SBI Credit Card rules, SBI Cards, SBI New Credit cards,

State Bank of India to launch Rs 25,000 limit credit card soon.

కొత్త క్రెడిట్ కార్డులు ఎవరికి పడితే వారికి??

Posted: 12/12/2016 09:26 AM IST
Sbi brings new credit cards

నోట్ల పరిమితిపై ఆర్థిక శాఖ పరిమితి విధించటంతో ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నది తెలసిందే. ఈ నేపథ్యంలో అల్పాదాయ వర్గాలకు ఉపయోగకరంగా ఉండేందుకు త్వరలో తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు దేశ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు ప్రారంభించబోతుంది. రూ.25 వేల పరిమితి గల క్రెడిట్ కార్డులను ఎస్ బీఐ జారీ చేయనుంది.

‘‘ప్రజల సమస్య డబ్బు లేకపోవడం కాదని, కొనుగోలు చేయడానికి వారి వద్ద క్రెడిట్ కార్డులు లేకపోవడమే అసలు సమస్య. ఖాతాదారులకు ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేకున్నా వీటిని జారీ చేస్తామని ఎస్ బీఐ కార్డ్స్, పేమెంట్ సేవల చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ జసూచా ప్రకటించాడు. అయితే, అదే సమయంలో వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న కొంత నగదును నిల్వగా కచ్చితంగా ఉంచుకుంటామని వివరించారు.

రెండు, మూడు నెలల్లో ఇది కార్యరూపం దాలుస్తుందని, ఏడాదిలో 9 నుంచి 10 లక్షల కార్డుల వ‌ృద్ధి సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించాడు. సాధారణంగా ఎనభై శాతం నగదు, ఇరవై శాతం కార్డు వినియోగించే వారు, ప్రస్తుతం తొంభై శాతం కార్డు, పదిశాతం నగదు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాష్ లెస్ పిలుపునకు మంచి స్పందన వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తొమ్మిది నుంచి పదకొండు రోజుల్లోగా క్రెడిట్ కార్డులను ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల రీత్యా రెండుమూడు రోజుల్లోనే కార్డులు అందించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : State Bank of India  25000 Credit Cards  

Other Articles