మౌనమే నీ భాష... ఓ మూగ మనసా అంటున్న రఘురామ్ రాజన్ Raghuram Rajan preferred silence over demonetisation

Raghuram rajan preferred silence over demonetisation

Raghuram Rajan, IIM Ahmedabad, silent, Demonetisation, Current Affairs, Former RBI Governor, raghuram rajan, urjit patel, urjit patel salary, raghuram rajan salary, demonetisation, urjit patel staff, urjit patel home, reserve bank of india, rbi, demonetisation news, rbi news, india news

Raghuram Rajan, the former RBI Governor visited the Indian Institute of Management Ahmedabad campus as the distinguished service professor of finance, University of Chicago Booth School of Business, but preferred silence over demonetisation

మౌనమే నీ భాష... ఓ మూగ మనసా అంటున్న రఘురామ్ రాజన్

Posted: 12/10/2016 07:22 PM IST
Raghuram rajan preferred silence over demonetisation

మౌనమే నీ భాష... ఓ మూగ మనసా... అన్న పాట గుర్తుందా.. సరిగ్గా అది ఇప్పుడు ఆయన కోసమే రచించినట్లు.. ఆలపించినట్లు సరిపోతుంది. ఎవరాయన అంటారా..? బీజేపి పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి నుంచి తన పదవి కాలం చివర్లో విమర్శలెదురుకుని, మరో పర్యాయం ఆయన కాలపరిమితి పోడిగింపు కోసం ప్రయత్నించే ఆశలపై నీళ్లు చల్లడంతో.. తనకు అసలు ఆ పదవే వద్దని ఆయనే స్వయంగా ప్రకటించుకునేలా పరిస్థితులను కల్పించాన వ్యక్తి మరోవరో కాదు రఘురాం రాజన్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  గవర్నర్ గా రాజీనామా  చేసిన  రఘురామ రాజన్  మొదటి సారి అహ్మదాబాద్ ఐఐఎం-ఎ ను సందర్శించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్  అహ్మదాబాద్ క్యాంపస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్  యూనివర్శిటీ విశిష్ట్ ప్రొఫెసర్ గా  'ప్రపంచ ఆర్థిక వ్యవస్థ:అవకాశాలు మరియు సవాళ్లు' అనే అంశంపై  లెక్చరిచ్చారు. కానీ పెద్ద నోట్ల రద్దుపై ఒక ముక్క కూడా మాట్లాడకపోవడం విశేషం. డీమానిటైజేషన్ పై ఎలాంటి ప్రస్తావన లేకుండానే ఆయన ప్రసంగ పాఠం ముగిసింది.

డీమానిటైజేషన్ సహా దేశంలోని కొన్ని నిర్దిష్ట ఆర్థిక అంశాల ప్రస్తావన ఉంటుందని  విశ్వసించిన వారికి నిరాశే ఎదురైంది. ఐఐఎం బోధనా సిబ్బంది, విద్యార్థులు, 1987 పూర్వ విద్యార్థులు బ్యాచ్, ఇతర పూర్వ విద్యార్ధులు కార్యక్రమానికి  హాజరై.. పెద్ద నోట్ల రద్దుపై రఘురాం రాజన్ మదిలో వున్న మాటలు ఏమిటో తెలుసుకుందామని వేచిచూశారు. కానీ వారి ఆశలన్నీ నీళ్లుగారిపోయాయి. ఆయన పెద్ద నోట్ల రద్దు అనే అంశంపై ఒక్క ముక్క కూడా మాట్లాడకుండానే తన ప్రసంగాన్ని ముగించడం.. కేవలం దాటవేత ధోరణి అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఉన్నత పదవి నుంచి దిగిపోయిన తరువాత ఆ పదవికి సంబంధించి, ఆ పదవిలో వున్న వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిం ఎలాంటి అక్షేపణలు, అభ్యంతరాలు తెలిపినా సమంజసం కాదని.. అందుచేత అయన మౌనంగా దానిని దాటవేసి తన హుందాతనాన్ని నిలుపుకున్నారన్నవారు కూడా లేకపోలేరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuram Rajan  IIM Ahmedabad  silent  Demonetisation  Current Affairs  Former RBI Governor  

Other Articles