‘నోట్ల రద్దు’ మద్దతుపై వెనక్కి తగ్గిన నితీష్ JDU steps up attack at BJP on land deal

Jdu steps up attack at bjp on land deal claims huge cash paid

Note Ban, demonetisation, Rahul Gandhi, Lalu Prasad Yadav, RJD, Mahagathbandhan, bjp land deals, cashless economy, Nitish Kumar, Narendra Modi, JD(U), Congress, RJD, Amit Shah, corruption, Lok Samvad

JDU climbed down from his earlier position on demonetisation, cashless economy was not possible to fully implement in a country like India.

‘నోట్ల రద్దు’ మద్దతుపై వెనక్కి తగ్గిన నితీష్

Posted: 12/08/2016 04:26 PM IST
Jdu steps up attack at bjp on land deal claims huge cash paid

సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని విభేధించి.. తన రాష్ట్రంలోనూ అప్పటి వరకు కొనసాగిన మైత్రిని తెగదెంపులు చేసుకుని బీజేపి పార్టీకి దూరమైన మిత్రుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. పెద్ద నోట్ల రద్దు తరువాత బీజేపికి చేరువైనట్లే చేరువై.. వెనక్కి తగ్గారు. నరేంద్రమోడీ ప్రభుత్వం గత నెల 8న తీసుకున్న నిర్ణయానికి బేషరుతుగా మద్దుతు ప్రకటించిన నితీష్ కుమార్ అంతలోనే ప్లేటు ఫిరాయించారు. అంతేకాదు బీజేపిపై వస్తున్న భూ లావాదేవీల అరోపణలపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

యావత్ ప్రపంచమే నగదు రహిత లావాదేవీల వైపు పయనిస్తుందని, ఈ క్రమంలో మనం కూడా ప్రపంచంతో కలసి పయనిస్తున్నామన్నారు. అయితే భారత్ లాంటి దేశాల్లో నగదు రహిత లావాదేవీలు అసాధ్యమని అభిప్రాయపడ్డిన అయన అందుకు భారత్ దేశ ప్రజలు వ్యవహారశైలి, సామాజిక వాతావరణం విరుద్దంగా వుంటాయని అన్నారు. ఇలాంటి దేశంలో నగదు లావాదేవీలు నిత్యం కోనసాగుతూనే వుంటాయని, అందుకు నిరక్షరాస్యత వంటి సామాజిక అంశాలు కూడా కారణమన్నారు. పాట్నాలో లోక్ సంవద్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన నగదు రహిత లావాదేవీల అంశాలపై ప్రసంగించారు.

అవినీతి, నల్లధనాన్ని టార్గెట్ చేసిన ప్రధాని నరేంద్రమోడీకి నిజంగా చిత్తశుధ్ది వుంటే దేశవ్యాప్తంగా బినామి అస్తుల నిగ్గుతేల్చాలని నితీష్ డిమాండ్ చేశారు. అక్రమార్కులు ఇప్పటికే తమ వద్దనున్న నల్లధనంతో బినామీ పేర్లతో అస్తులను కూడబెట్టుకున్నారని అరోపించారు. నల్లధనాన్ని క్రమబద్దీకరించేలా కేంద్రం తీసుకువచ్చిన తాజా అదాయ పన్ను సవరణ బిల్లుపై కూడా అయన విమర్శలు గుప్పించారు. దేశంలో నల్లధనం పోయిందని ప్రజలు భావిస్తున్నారని, అయితే అక్రమార్కులు బినామీ రూపాల్లో ధనాన్ని దాచుకుంటే ప్రజల అవస్థలకు అర్థమే లేకుండా పోతుందని నితీష్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Note Ban  demonetisation  Nitish Kumar  Narendra Modi  JD(U)  Congress  RJD  Amit Shah  corruption  

Other Articles