బ్యాంకులకు మూడు రోజుల వరుస సెలవులు.. three days continous holidays to banks

Government advances eid e milad holiday to december 12

Eid-e-Milad, eid, Eid-e-Milad-un Nabi, bank holidays, demonetisation, currency, cash crunch, Banks, ATM centres, cash, Modu Singh Gurjar, Rajasthan Tourism Development, severe chest pain, Rajveer Singh Champawat, bank queue, cardiac arrest, 46-year-old man, nearby hospital, Chandwaji town

It will be an extended weekend for banks as the Centre has decided to advance the holiday for 'Eid-e-Milad' to Monday instead of Tuesday.

బ్యాంకులకు మూడు రోజుల వరుస సెలవులు..

Posted: 12/08/2016 12:59 PM IST
Government advances eid e milad holiday to december 12

నవంబర్ 8న పెద్దనోట్లు రద్దు చేసి ఇవాళ్టికి 30 రోజులు కావస్తున్నా.. ప్రధాని నరేంద్రమోడీ అడిగిన 50 రోజుల సమయంలో సగానికి కంటే ఎక్కువ సమయం గడిచిపోయినా.. దేశంలోని సామాన్యులకు మాత్రం 11వ రోజు ఏర్పడిన పరిస్థితులే ఇంకా ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, అర్బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలు పదే పదే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్తనోట్లను పంఫిణీ చేస్తామని, కొత్త 500 రూపాయల నోట్లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని ప్రకటనలు గుప్పిస్తున్నా.. పరిస్థితుల్లో మాత్రం మార్పు కానరావడం లేదు.

ప్రధాని నోట్ల రద్దు ప్రకటన చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా తెరుచుకోని ఏటీయం కేంద్రాలు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలోనే వున్నాయి. కేంద్ర పెద్దలు, అధికారుల ప్రకటనలు వెలువడినప్పుడల్లా ఇక్కడకు వచ్చి.. ఇప్పుడైనా తెరుచుకుంటాయా..? అని అశగా ఎదురు చూసిన కస్టమర్లకు నిరుపయోగంగా మారిని ఏటీయం మిషన్లు వెక్కిరిస్తూ వెటకారంగా నవ్వుకుంటున్నాయి. ప్రకటన వచ్చిన తరువాత పర్వాలేదనిపించిన ఏటీయం కేంద్రాలు.. అప్పటి నుంచి ఒకటి రెండు వారాలు ఇబ్బందులకు గురిచేశాయి. ఇక డిసెంబర్ 1 రావడానికి ముందే షెటర్లు వేసేసుకున్నాయి.

ఇక ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఇది నిజంగా చేదు వార్తే. వరుసగా మూడు రోజులు బ్యాంకుల సెలవులతో మరిన్ని కష్టాలు రానున్నాయి. వచ్చే శనివారం రెండవ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. అలాగే ఆదివారం సాదారణ సెలవు, సోమవారం మహ్మదీయుల ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చే షిల్లార్‌-ఉల్‌-నబీ పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు. దీంతో ఇప్పటికే కరెన్సీ కష్టాలతో మూలుగుతున్న ప్రజలపై బ్యాంకుల వరుస సెలవులు తాటికాయను పడేశాయి.

బంగారు భవిష్యత్తు కోసం కొంత బాధనైనా భరిచేందుకు సిద్దమైన సామాన్యులకు మూడు పదుల రోజులు గడుస్తున్నా ఇంకా ఎండమావులే కనబడుతున్నాయి. 30 రోజులు పూర్తి అయినప్పటికీ కరెన్సీ కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. గోరుచుట్టుపై రోకలి పోటు చందాన బ్యాంకులకు వరుస సెలవులు వచ్చిపడ్డాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఏటీఎంలు 90 శాతం పై బడి పనిచేయడం లేదు. ఈ పరిస్థితులల్లో మూడు రోజుల పాటు బ్యాంకులూ లేక, ఏటీఎంలు పనిచేయక కరెన్సీ కష్టాలు ఎలా తీరుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గురు,శుక్రవారాల్లోనైనా బ్యాంకుల నుంచి సరిపడ చెల్లింపులు ఇవ్వాలని కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eid-e-Milad-un Nabi  bank holidays  demonetisation  currency  cash crunch  Banks  ATM centres  cash  

Other Articles