నగదు కొరతను అంగీకరించిన అర్థికమంత్రి, ప్రధానిపై ప్రశంసలు Demonetisation to boost growth in long run

Demonetisation to boost growth in long run pain transitory says arun jaitley

arun jaitley, demonetisation, finance minister arun jaitley, rbi, rbi releases, petrotech conference in new delhi, Petrotech, India, gdp, pm modi, demonetisation modi

PM Modi could have taken the easy way out when it came to disrupting seven decades of normalcy with demonetisation, but opted for the “harder” path and has “broad shoulders” to face the consequences

నగదు కొరతను అంగీకరించిన అర్థికమంత్రి, ప్రధానిపై ప్రశంసలు

Posted: 12/08/2016 11:21 AM IST
Demonetisation to boost growth in long run pain transitory says arun jaitley

దేశం నుంచి అవినీతి, నల్లధనాన్ని తరమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు చారిత్రక నిర్ణయమని అభివర్ణించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. ఈ నిర్ణయం అమలు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నగుదు కొరత సంక్షోభం నెలకొందని, అయితే ఇది తాత్కాలికంగానే వుంటుందని అయన అభిప్రాయపడ్డారు. పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వ నిర్ణయం సరైందేనని, కితాబిచ్చిన ఆయన ప్రధాని మోడీ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించారు. దీర్ఘకాలంలో పెద్ద నోట్ల రద్దు దేశా అర్థిక ప్రగతికి దోహధపడుతుందని అన్నారు.

పెద్దనోట్ల స్థానంలో కొత్త కరెన్సీ పూర్తిగా చెలామణిలోకి రావడానికి కొంత సమయం పడుతుందని, ఈ పరివర్తన సమయంలో ప్రజలకు కొన్ని ఇబ్బందులు, అవస్థలు పడక తప్పదన్నారు. పెట్రోటెక్ 2016 సమావేశంలోఆర్థిక మంత్రి ప్రసంగిస్తూ.. గత ఏడు దశాబ్ధాలుగా వున్న కరెన్సీ సాధరణ పరిస్థితిని కొనసాగించేందుకు బదులు ప్రధాని మోడీ పెద్ద నోట్లు రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకుని కొత్త సాధరణ పరిస్థితికి తీసుకురావాలని అకాంక్షిస్తున్నారని ఆయన అన్నారు. ప్రధాని ఈ నిర్ణయాన్ని తీసుకుని పర్యవసానాలన్నింటినీ తన భుజాతపైనే వేసుకున్నారని, ఇది దేశహితాన్ని కాంక్షించే వారికే సాధ్యమని ప్రధానిపై ప్రశంసలు కురిపించారు.

క్యాష్ లెస్ ఎకానమీ దిశగా భారత్ ను నడిపించే క్రమంలో.. దేశం యావత్తు డిజిటల్ వైపు అకర్షితులవుతున్న నేపథ్యంలో సామాన్యులకు కొన్ని ఇబ్బందులు తప్పవన్నారు. ప్రజల అవస్థలను అర్థం చేసుకుని వాటిని అధిగమించేందుకు ప్రతి రోజు ఆర్ బీఐ కొంత కరెన్సీ కొంత మొత్తాన్ని విడుదల చేస్తోందని వివరించారు. స్వల్పకాలికంగా కొన్ని ఇబ్బందులు వున్నప్పటికీ దీర్ఘకాల ప్రయోజనాలు సమకూరనున్నాయన్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరగడం ఆర్థిక వృద్దిగా దన్నుగా నిలుస్తుందని జైట్లీ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrotech  India  gdp  Finance minister  demonetisation  Arun Jaitley  PM Modi  

Other Articles