విలన్ లా దాడి చేసిన హీరో అరెస్టు.. Actor 'Duniya' Vijay detained for assault

Actor duniya vijay detained for assault

‘Duniya’ Vijay, Kannada hero, sandal wood hero, duniya vijay detained, sandal wood hero detained, hero detained by police, hero in assult case, hero manhandling producer's relative, Sundar Gowda, producer, Masti Gudi .

Kannada actor ‘Duniya’ Vijay, has been detained by the police for allegedly assaulting a relative of Sundar Gowda, the producer of the Masti Gudi.

నిర్మాత బంధువుపై హీరో దాడి.. అరెస్టు..

Posted: 11/16/2016 11:44 AM IST
Actor duniya vijay detained for assault

ఆయన ఒక హీరో.. మంచి సందేశాత్మక చిత్రాలను ప్రజలకు అందించేందుకు తన వంతుగా ఎంతవరకైన కష్టపడి తన అభినయంతో అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే హీరోగా నటిస్తే మాత్రమే సరిపోదు.. ఆలా తమ తీరును కూడా మార్చుకోవాలి.. సినిమాల్లో అడపడచులకు అండగా నిలవడం కాదు.. నిజజీవితంలోనూ అలానే వుండాలని ఆయనకు అభిమానులు సూచిస్తున్నారు. ఎందకంటే.. ఆయన హీరోగా కోనసాగుతూ.. విలన్ లా వ్యవహరించారు. ఆటపడచులకు అండగా నిలవాల్సిన వాడు.. నిర్మాత తమ్ముడికి వంతపాడుతూ దాడులకు పాల్పడినందుకు.

మాస్తిగుడి చిత్రం షూటింగ్ లో నెలకోన్న విషాధ సంఘటనను నుంచి తృటితో తప్పించుకుని.. తన అదృష్టవశాత్తు కలసివచ్చిన పునర్జన్మలో కూడా హీరో విలన్ లా వ్యవహరించడాన్ని  అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ హీరో ఎవరో అర్థమైంది కదూ. ఆయన మరెవరో కాదు కన్నడ హీరో దునియా విజయ్‌. మస్తిగుడి చిత్రం షూటింగ్ లో తన సహచరులైన ఇద్దరు నటులను కోల్పయిన విషాదం ఆయనలో ఏ మాత్రం కనిపించలేదు. అందుకేనేమో ఆయన మరో వివాదంలో చిక్కుకున్నాడు.

మాస్తిగుడి విషాదఘటనలో చిత్ర నిర్మాత సుందర్‌ పీ.గౌడను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. కాగా సుందర్ గౌడ సోదరుడు శంకర్ తన భార్యపై గృహహింసకు పాల్పడుతున్నాడని, అదనపు కట్నం కోసం వేదిస్తున్నాడని బాధితురాలి తల్లి యశోధా అరోపించారు. అప్పటి నుంచి తమ కుమార్తెను చూడటానికి కూడా తమ ఇంటికి పంపించవాడు కాదని చెప్పారు.

ఈ నేపథ్యంలో తమ బిడ్డను చూసేందుకు బాధితురాలి తండ్రి జయరామ్‌ శంకర్ ఇంటికి వెళ్లగా.. అదనపు కట్నం కోసం నిలదీసి గోడపడ్డాడని.. అంతటితో ఆగకుండా హీరో దునియా విజయ్‌ను ఇంటికి పిలిపించి ఇద్దరు కలసి తన భర్తపై దాడికి పాల్పడ్డారని జయరామ్‌ భార్య యశోదా ఆరోపించారు. ఈ మేరకు అమె చెన్నమ్మనకెరె అచ్చుకట్టు కెరె పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.

హీరో దునియా విజయ్‌ తన భర్త జయరామ్‌ను ఛాతిభాగంలో బలంగా కొట్టడంతో ఎముకలు విరిగాయని, ప్రస్తుతం ఆయన శేఖర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని యశోదా తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దునియా విజయ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తర్వాత బెయిల్‌ పై అతడికి విడిచిపెట్టారు. నిర్మాత సోదరుడి రుణం తీర్చుకునేందుకు హీరో ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడో ఏమో తెలియదు కానీ.. అభిమానులు మాత్రం ఇలాంటి చర్యలను స్వాగతించడం లేదు. నిర్మాత సోదరుడి కుటుంబానికి సంబంధిచిన అంశంలో జోక్యం చేసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Duniya Vijay  Masti Gudi  Sundar Gowda  Jayaram  sandalwood  

Other Articles