పాలు వర్సెస్ బీరు... అసలు సీక్రెట్ ఇదేనా? | Drink Beer to Save Cows PETA's senseless Campaign

Drink beer to save cows totally senseless

PETA's new and senseless Campaign, Drink Beer to Save Cows, Beer is better choice than Milk, Beer versus milk PETA, PETA beer vs Milk

PETA's new and senseless Campaign Drink Beer to Save Cows.

నాన్ సెన్స్ : పాలు వద్దురా... బీరు మగ్గు లేపరా!

Posted: 10/27/2016 03:07 PM IST
Drink beer to save cows totally senseless

సిగరెట్, మద్యం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రకటనలు దంచే యాడ్ లు ఓ పక్క ప్రచారం చేస్తుంటే మళ్లీ ఈ వార్త ఏంటంటారా? అక్కడికే వస్తున్నాం. జంతువుల పరిరక్షణకు పోరాడే పెటా (జంతు సంరక్షణ సంస్థ) పీపుల్స్ ఫర్ ది ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ ఎనిమిల్స్)  తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. అందులో మీ కోసమే ఈ బీరు అంటూ చెబుతోంది.. అంతేనా గాట్ పేరిట ఓ ప్రొడక్ట్ ను రిలీజ్ చేసింది కూడా.

అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్శిటీ మాడిసన్ క్యాంపస్ కు దగ్గర్లో 'గాట్ బీర్' పేరుతో ఓ బిల్ బోర్డును చూడొచ్చు. పాలు తాగడం కంటే బీరు తాగడమే ఆరోగ్యానికి మంచిదనే విషయం సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందని అందులో పేర్కొంది. పాలకన్నా బీరు బలవర్ధకమైనదని, ఎముకల పటుత్వాన్ని పెంచడమే కాకుండా ఆయుష్షును కూడా పెంచుతుందని తెలిపింది. పాల ఉత్పత్తులను వాడటం ద్వారా ఎముకలు గుల్లబారే ప్రమాదం ఉందని పెటా వెల్లడించింది. పాలు సేవించడం వల్ల డయాబెటిస్, ఒబేసిటీ, కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. ఈ నేపథ్యంలో, 'ఇట్ ఈజ్ అఫీషియల్' అంటూ బీరుకు ప్రచారం చేస్టోంది పెటా.

2000 సంవత్సరంలో కూడా బీరుకు అనుకూలంగా పెటా ప్రచారం చేసింది. అయితే, పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కి తగ్గింది. పాల కోసం లక్షలాది ఆవులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని... పాల వినియోగం తగ్గితే, వాటిని హింసించడం కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో బీర్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నామని తెలిపింది. అయితే ఆల్కహాల్ మితంగా తీసుకోవడం అన్న ఆరోగ్య సూత్రానికి అనుగుణంగా తాము ఈ ప్రకటనలో భాగస్వాములం అయ్యామని పెటా ఉపాధ్యక్షుడు ట్రేసీ రీమన్ చెబుతున్నాడు.

కానీ, నిపుణులు మాత్రం పెటా బుద్ధి లేని ప్రకటన అంటూ తిట్టి పోస్తున్నారు. వారు ఏం చెబుతున్నారంటే ఇండియాలో ప్రతీ 90 నిమిషాలకు ఆల్కహాల్ మూలంగా ఓ వ్యక్తి మరణిస్తున్నాడు. 2013 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఈ విషయాన్నే ధృవపరుస్తోంది. భారత్ లాంటి పెద్ద కంట్రీలోనే ఇలా జరిగినప్పడు, పాలు కన్నా బీరు మేలని మీరెలా చెబుతారు, ఈ లెక్కన పిల్లలను మద్యం సేవించమని చెబుతారా? అంటూ వారు పెటాపై మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beer  Milk  PETA  new campaign  

Other Articles