కేంద్రానికి సెగ: పెట్రోల్ కు జతకలిసిన గ్యాస్.. After Refueling stations, Now LPG dealers too threaten strike

After refueling stations now lpg dealers too threaten strike

All-India petrol dealers strike, LPG dealers strike, LPG Dealers, lpg dealers protests over demands, indefinite strike, petrol dealers stir, telugu states petrol bunk strike, petrol bunk strikes, petroleum, oil companies, andhra pradesh news, india news,

After All-India petrol dealers to go on phasewise agitation for the perusal for following long-pending dealer demands, now lpg dealers too join them to rock the heat at the center.

పెట్రోల్ కు జతకలిసిన గ్యాస్.. సెగ కేంద్రానికా.? ప్రజలకా..?

Posted: 10/27/2016 02:01 PM IST
After refueling stations now lpg dealers too threaten strike

దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా వున్న తమ సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఇప్పటికే పెట్రోల్ బంక్ డీలర్లు అంచలవారీ అందోళనకు తెరలేపిన నేపథ్యంలో వారి ఉద్యమానికి మరింత బలం చేకూరుతుంది. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఏకంగా తాము భారత్ బంద్ కు పూనుకుంటున్నామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో వారికి బాసటగా నిలుస్తూ తమ సమస్యల పరిష్కారానికి కూడా ఇదే మార్గమని పెట్రోల్ బంకు డీలర్లకు ఎల్‌పీజీ డీలర్లు జతకలిశారు. పదే పదే తమ సమస్యలను కేంద్రప్రభుత్వం దృష్టికి, ఇంధన సంస్థల దృష్టికి తీసుకువెళ్తున్నా వాటిని పరిష్కరించడంలో అవి పూర్తిగా విఫలమయ్యాయని అందుచేతనే తాము కూడా అందోళనబాట పట్టక తప్పని పరిస్థితి ఉత్పన్నమైందని వారు చెప్పారు.

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్లక్ష్య వైఖరితోనే తాము అందోళన బాట పడుతున్నామని భారత ఎల్‌పీజీ డీలర్ల సమాఖ్య ప్రకటించింది. దీంతోనే తాముదేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొంది. గ్యాస్‌ సిలిండర్ల వల్ల ప్రజలు కానీ, డెలివరీ బాయిస్ కానీ ప్రమాదాలకు గురికాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని తాము గత కొంత కాలంగా కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు,

ఎల్ పీజీలకు కొత్త డిస్ట్రిబ్యూటర్లను నియమించరాదని, కమీషన్‌ పెంచాలని కూడా తాము కోరామని, వీటితో పాటు పటిష్టమైన లాకింగ్‌ కలిగిన సిలిండర్లు మాత్రమే సరఫరా చేయాలని, 5 కిలోల సిలిండర్లను ప్రజలకు అందుబాటులోకి తీసకురావాలన్న డిమాండ్లతో పాటు ఇంకా అనేక డిమాండ్లను ఏళ్లుగా అపరిష్కృతంగా వుంచడం వల్లే తాము అందోళనబాట పడుతున్నామని సమాక్య సభ్యలు పేర్కోన్నారు.

తమ డిమాండ్ల పరిష్కారం కోసం నవంబరు 5 నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఆరంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలను చైతన్య పరిచేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తారు. నవంబరు 22న అర్ధరోజు పాటు డిస్ట్రిబ్యూటర్‌ కార్యాలయాలు మూసివేస్తారు. నవంబర్‌ 29, డిసెంబర్‌ 1న పూర్తిరోజు కార్యాలయాలు మూసివేస్తారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో డిసెంబరు 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతారు. అయితే ఈ పరిణామం నేపథ్యంలో కేంద్రం దిగిరాకపోతే అ సెగ ప్రజలకు అంటుకోక తప్పదని ప్రజలు అందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol bunks  dealers  telugu states  strike  india  

Other Articles