తమిళనాట ఈ హాట్ డ్రింక్ కు భలే డిమాండ్.! youth prefers drinking monitor lizard blood in tamilnadu

This hot drink is very much famous in tamilnadu now

monitor lizard, blood drinking, tamilnadu, iguana blood, new type of drink, youth prefers drinking monitor lizard blood, youth prefers drinking iguana blood

some people in tamilnadu slit the throat of a live monitor lizard to ... to buy monitor lizard blood, which they drink in a cocktail with alcohol.

ITEMVIDEOS: తమిళనాట ఈ హాట్ డ్రింక్ కు భలే డిమాండ్

Posted: 10/27/2016 09:16 AM IST
This hot drink is very much famous in tamilnadu now

తమిళనాడులు ఇప్పుడీ ఈ హాట్ డ్రింక్ కు భలే డిమాండ్ ఏర్పడింది. ఈ హాట్ డ్రింక్ తాగితే కండరాల పటుత్వం వస్తుందని, నరాల బలహీనత పోతుందని, ఇంకా చెప్పాలంటే లైంగిక పటుత్వం కూడా పెంపోందుతుందని ప్రచారం జోరందుకోవడంతో.. ఈ హాట్ డ్రింక్ కోసం తమిళులు క్యూ కడుతూ మరీ తాగేస్తున్నారు. ఈ ప్రచారంలో శాస్త్రీయత ఉందో లేదో తెలియకుండానే గ్లాస్లులో పెగుల మాదిరిగా లాగించేస్తున్నారు. ఈ ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో.. గిరిజనులు వున్న ప్రాంతాలకు డిమాండ్ పరిపోతుంది.

గిరిజన ప్రాంతాలకు డిమాండ్ పెంచేలా చేసిన హాట్ డ్రింక్ ఏంటా అనుకుంటున్నారా..? అదే ఉడుము రుధిరాన్ని వీరు మధ్యం మాదిరిగా సోడా కలుపుకుని తాగేస్తున్నారు. అదేనండి ఉడుము రక్తాన్ని పచ్చిగానే తీసి గ్లాసుల్లోకి పోసుకుని అందులో సోడా కలిపేసి తాగుతూన్నారు. ఈ హాట్ డ్రింక్ కు ప్రస్తుతం తమిళనాడులో డిమాండ్ పెరిగిపోతుంది. అయితే దీని సేవించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వున్నాయోన్న విషయాన్ని ఇంకా వైద్య శాఖ అధికారులు వెల్లడించకపోవడంతో.. ప్రచారాన్ని నిజమని నమ్మి.. హాట్ డ్రింక్ కోసం ప్రజలు క్యూ కడుతున్నారు.

ఉడుపు రక్తానికి డిమాండ్ పెరగడంతో తమిళతంబిలు తమకు కూడా ఈ హాట్ డ్రింక్ కావాలంటూ గిరిజనులు నివసించే ప్రాంతాలకు వెళ్లి వారికి కోరినంత డబ్బునిస్తున్నారు. దీంతో తమిళనాడులోని పలువురు గిరిజనలు యథేచ్చగా ఉడుముల సంహారానికి పూనుకున్నారు. వాటిని కోసి.. రక్తం పిండి.. పలువురికి పంపిణీ చేస్తున్నారు. గ్లాసుల నిండా ఉడుము రక్తాన్ని కొందరు వ్యక్తులు గుటుక్కుమనిపిస్తోన్న దృశ్యాలు.. ఇంటర్నెట్ లోకి ఎక్కడంతో.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

అయితే ఈ వ్యవహారంపై అటవీశాఖ అధికారులు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రక్తం కోసం చంపడం వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద తీవ్రమైన నేరమని, సరీసృపాల రక్షిత జంతువు హింసించడం సమంజసం కాదని చెబుతున్నారు. కాగా, పాలవంతంగల్ అనే ప్రాంతంలో ఈ వ్యవహారం చోటు చేసుకుంటున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంచీపురం పరిధిలోని అటవీప్రాంతానికి చెందిన కొంతమంది గిరిజనులే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అక్కడి అటవీశాఖాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : monitor lizard  blood drinking  tamilnadu  

Other Articles