రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు మోడీ సర్కార్ పండగ కానుక President to get salary hike!

President and vice president to get salary hike

President, Pranab Mukherjee, India, Salary Hike, India, Government, Hamid ansari, Vice President of India, Seventh pay commission

On the recommendations of the 7th pay Commission, the Government of India has decided to hike the salaries of the President of India from current Rs. 1.5 lakh a month to Rs. 5 lakhs.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు మోడీ సర్కార్ దీపావళీ బోనాంజా.!

Posted: 10/26/2016 04:24 PM IST
President and vice president to get salary hike

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ- ఉప రాష్ర్టపతి హమిద్ అన్సారీలకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పండగ పర్వదినం నేపథ్యంలో తీపికబరును అందించనుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి పండగను పురస్కరించుకుని వారికి కానుకలను అందించనుంది. అదేంటి కానుక, అంటే.. వారి వేతనాలను భారీగా పెంచనుంది. ఔనా..! అంటూ నోరు వెళ్లబెట్టకండీ.. ఎందుకంటే మేం చెప్పేది వింటే మళ్లీ అదే చేయాల్సివస్తుంది. ఏకంగా మూడు వందల రెట్లకు పైగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల వేతనాలు పెరగనున్నాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు పర్చిన ఏడవ వేతన సంఘం సిఫార్సులతో క్యాబినెట్ కార్యదర్శకి రమారమి రెండున్నర లక్షల రూపాలయ వేతనాన్ని అందుకుంటుంన్న నేపథ్యంలో అది భారత రాష్ట్రపతి వేతనం కన్నా సుమారు లక్ష రూపాయలు అధికంగా వుండడం వల్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు వేతనాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను ఇప్పటికే సిద్ధం చేసింది.

దీంతో లక్షన్నర రూపాయల నెలసరి వేతనం వున్న రాష్ట్రపతికి ఏకంగా ఐదు లక్షలు, లక్షా పది వేల రూపాయల నెలసరి వేతనం వున్న ఉప రాష్ర్టపతికి మూడున్నర లక్షల రూపాయలుగా ప్రతిపాదించారు. రానున్న శీతాకాల సార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లును అమోదించాలని కేంద్రం భావిస్తుంది. దీంతో వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ర్రపతి - ఉపరాష్ర్టపతులిద్దరికీ పెంచిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. చివరగా 2008లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల వేతనాలను పెంచిన విషయం పాఠకులకు విధితమే. అయితే రిటైర్మెంటు తరువాత రాష్ట్రపతికి లక్షన్నర రూపాయల పెన్షన్ రాగా, అయన సతీమణికి సుమారు 30 వేల రూపాయల సెక్రటేరియల్ అసిస్టెన్స్ వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : President  Pranab Mukherjee  India  Salary Hike  India  Government  

Other Articles