ప్రియుడిపైకి ‘పోర్న్ స్టార్’ వల విసిరిన ప్రియురాలు..! Fiancé test wouldbe with secret cameras

Girl tests boyfriend if he would cheat with a porn star

To Catch a Cheater, boyfriend, cheating, viral video, wouldbe, fiance, porn star, Viral, Viral Video, Cheating Partner, Pornography

A video of a girlfriend testing the loyalty of her boyfriend by sending a porn star to flirt with him has become a viral sensation

ITEMVIDEOS: ప్రియుడిపైకి ‘పోర్న్ స్టార్’ వల విసిరి.. ప్రియురాలు!

Posted: 10/26/2016 11:33 AM IST
Girl tests boyfriend if he would cheat with a porn star

విదేశాలలో అబ్యాయిలకు అమ్మాయిలు, అమ్మాయిలకు అబ్బాయిలతో స్నేహం సాధారణంగా మారిపోయింది. అయితే బాయ్ ఫ్రెండ్ నుండి పదోన్నతి పోందుతున్న వేళ.. అదేనండీ భర్త కాబోతున్న తరుణంలో తనకు కాబోయేవాడు తనను జీవితాంతం చక్కగా చూసుకుంటాడా..? లేదా..? అన్న అనుమానం కూడా రేకెత్తక మానదు. తన బాయ్ ఫ్రెండ్ ను నమ్మి నయవంచనకు గురవ్వడం ఇష్టం లేని అమ్మాయిలు.. తాము ఎవరి చేతిలోనో మోసపోతామని తెలిస్తే తట్టుకోలేమని భావిస్తుంటారు. అలాంటి వారు కొంత రిస్క్ తీసుకుని తమ ప్రియుడ్ని పరీక్షిస్తుంటారు.

ఇలాంటి చర్యలు చేపట్టి ఓ ప్రియురాలు.. తన భాయ్ ఫ్రెండ్ తనతో నమ్మకంగా వుంటాడా లేదా..? అని పరీక్షించి యావత్ ఘటనఫై మిశ్రమంగా స్పందించింది. అతను టెస్టు పాసయ్యాడని తెలిసినా.. అంతగా సంబరపడలేదు. అయితే చివరాఖరున మాత్రం.. తాను చేసిందంతా వృధా ప్రయాసేనని అర్థమైంది. ఎందుకలా అంటారా..? ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రియురాలికి ఎదురైన పరిణామంతో అన్ లైన్ ప్రేక్షకులు కూడా షాక్ కు గురయ్యారు.

తన ప్రియుడు తనను మోసం చేస్తాడా..? లేక నమ్మకంగా వుంటాడా అని ఒక ఫోర్న్ స్టార్ ను అతనిపైకి ఉసిగోల్పింది ఓ ప్రియురాలు. అతను షాపింగ్ చేయడానికి ఓ స్టోర్ వద్దకు వెళ్లగా అతనికి ఎదురుగా అందగా ముస్తాబై నిల్చుంది. అమె నుంచి వచ్చిన సంకేతాలను ప్రియుడు అంతగా పట్టించుకోలేదు. అయితే అతను స్టోర్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో అతని వద్దకు వెళ్లి అతని ఫోన్ నెంబర్ ను అడిగ్గా.. అతను ఎందుకని అడిగాడు. నీకు గర్ల్ ప్రెండ్ వుందా..? అని కూడా అరా తీయగా, తనకు ప్రేయసి వుందని, అమె తన గురించి చాలా అలోచిస్తుందని కూడా చెప్పాడు.

ఇంతలో  మరో అడుగు ముందుకేసిన ఫోర్న్ స్టార్.. తాను ఫోర్న్ స్టార్ అని.. ఈ రాత్రికి మనం గడుపుదామా అని తెగేసి అడిగేసింది. అయితే తనకు తన ప్రియురాలు వున్నంత వరకు ఫోర్న్ స్టార్ తో గడపాలన్న ఉద్దేశం లేదని.. ప్రియుడు కూడా అమెకు తగ్గట్టుగానే సమాధానమిచ్చాడు. అమెకు గుడ్ బై అని చెప్పి ముందుకు నడుస్తుండగా, అమె అతని వెంటపడింది. తనను తన ఇంటి వరకు దింపాలని కోరింది, తాము నిల్చుని వున్న వీధి చివరే తన ఇళ్లని, అక్కడకి వెళ్లి ఇద్దరం రాత్రిని ఎంజాయ్ చేద్దమాని చెప్పింది. అమె కోరికను విన్న ప్రియుడు అమె మాటలను లక్ష్యపెట్టకుండా తన కారు వైపుకి వెళ్లాడు. అయినా అమె వెంటపడింది. కానీ ప్రియుడు ఏ మాత్రం లొంగలేదు. దీంతో అతడు ప్రియురాలి పరీక్షలో పాసయ్యాడు.

ఇంతవరకు బాగానే వున్నా ప్రియురాలి ముఖంలో మాత్రం ఇంకా అశ్చర్యకరమైన.. సందేహాత్మమైన ట్విస్టులు కనబడుతున్నాయి. ఎందుకలా అంటే పొర్న్ స్టార్ నెంబర్ తీసుకుని తన బాయ్ ఫ్రెండ్.. మొబైల్ లో సేవ్ చేసుకున్నాడని, గ్రూప్ హ్యాంగవుట్ లకు తనను అహ్వానిస్తానని చెప్పడమే అమెలో మిశ్రమ స్పందనలు వెల్లువెత్తడానికి కారణమని తెలిపింది. అయితే ఫోర్న స్టార్ ఎంతలా వెంటపడినా తన ఫోన్ నెంబరు కూడా ఇవ్వని ప్రియుడ్ని, అమె మీదపడినా చలించని భాయ్ ప్రెండ్ ను మాత్రం తాను వదులుకోనని చెప్పింది.

ఇక ఈ సంబరంలో అమ్మడు చేయరాని పని చేసింది. తానే ఫోర్న్ స్టార్ ను అతడి వద్దకు పంపానని, ఇదంతా ప్రాంక్ అని ఫోన్ లో బాయ్ ప్రెండ్ తో చెప్పడంతో ప్రియుడికి చిర్రెత్తుకోచ్చింది. వెంటనే ఫోన్ కట్ చేసి.. అమెతో తెగదెంపులు చేసుకున్నాడు. ఇంకేముంది తాను చేసినదంతా వృధా ప్రయాసేనని తేలిపోవడంతో ప్రియురాలు బిక్కముఖం వేసింది. నమ్మకంతో సాగాల్సిన కాపురా్లోకి.. అనుమానం అనే విషబీజం ప్రవేశిస్తే వచ్చే పరిణామాలు దారుణంగా వుంటాయని అమ్మడికి పరీక్ష తరువాత తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : To Catch a Cheater  boyfriend  cheating  viral video  wouldbe  fiance  porn star  

Other Articles