అగ్రరాజ్యం అధ్యక్షుడు ఒబామాకు మిషెల్లీ విడాకులిస్తున్నారా..?! Michelle Would Divorce Me: Barack Obama

If i were able to run for third term michelle would divorce me barack obama

Barack Obama,President Barack Obama,Jimmy Kimmel Live,US presidential elections,US elections 2016, donald Trump, jokes, Third time, hillary clinton

"If I were able to run for a third term, Michelle would divorce me," American president Barack Obama said, noting his wife does not like politics.

అగ్రరాజ్యం అధ్యక్షుడు ఒబామాకు మిషెల్లీ విడాకులిస్తున్నారా..?!

Posted: 10/25/2016 08:01 PM IST
If i were able to run for third term michelle would divorce me barack obama

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మిషెల్లీ విడాకులిస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు ఒబామా. నిజమండీ.. అయితే రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా చేసిన ఆయనకు ఫస్ట్ లేడీగా కోనసాగుతున్న మిషెల్లీ ఎందుకు విడాకులిస్తున్నారు..? పదవి పోగానే అయనను కరివేపాకులా తీసేస్తున్నారా..? అంటే కానేకాదట. అమెరికా అధ్యక్షుడిగా మూడో పర్యాయం కూడా బరిలో ఎందుకు నిలవలేదని అమె ఒబామాకు విడాకులు ఇచ్చేందుకు సిద్దపడ్డారా..? అంటే.. అది కూడా కాదట.

అసులు విషయాన్ని మాత్రం ఒబామా చాలా చమత్కారంగా చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ఎవరికైనా రెండు పర్యాయాలు మాత్రమే అవకాశం వుంటింది. దీంతో తనకు మరోమారు అధ్యక్షుడయ్యేందుకు అవకాశం లేదు. అయితే ఒక వేళ మూడో పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైయ్యే అవకాశమే కనక తనకు వుండివుంటే.. మాత్రం మిషెల్లీ తనకు విడాకులిస్తుందని ఆయన చమత్కరించారు. అంతే ఈ విషయం చెప్పడంతో లైవ్ షోలో వున్న వారంతా నవ్వారు. తన భార్య మిషెల్లీకి రాజకీయాలంటే అసుల ఇష్టముండదని అయన అసలు విషయాన్ని నెమ్మెదిగా చెప్పారు.

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ల తరుపున బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ప్రతిసారి తనను ట్వీట్ ద్వారా విమర్షించడంపై కాస్త భిన్నంగా స్పందించారు. ఒబామా త్వరలోనే దిగిపోతున్నారు.. అయితే, ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఇప్పటి వరకు ఎన్నికైన అధ్యక్షుల్లోనే చెత్త అధ్యక్షుడు అని ట్రంప్ చేసిన ట్వీట్ పై స్పందించిన ఒబామా కనీసం తాను అధ్యక్షుడిగానైనా దిగిపోతున్నానని చెప్పారు. దీంతో ట్రంప్ కు అధ్యక్షుడు కూడా కాడన్న సందేశాన్ని అయన దేశ ప్రజలకిచ్చారు.

ట్రంప్ను టీవీలో చూస్తున్నప్పుడు మీరెప్పుడైనా నవ్వారా అని ప్రశ్నించగా చాలాసార్లు నవ్వానని అన్నారు. 2011లో సునామీ జపాన్ను చుట్టుముట్టినప్పుడు తాను నిద్రలో నుంచి మేల్కోని అర్థరాత్రి మూడు నాలుగుసార్లు బెడ్పై ఉండే ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. అయితే, తాను ఎప్పుడూ కూడా తెల్లవారు జామున తన స్మార్ట్ ఫోన్ వద్దకు వెళ్లేవాడిని కాదని, తనను విమర్శించేవారిపై ఉదయం మూడు గంటలకే ట్వీట్ ల ద్వారా ఆరోపించే అలవాటు తనకు లేదంటూ ట్రంప్ ను విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  donald Trump  jokes  US presidential elections  Third time  hillary clinton  

Other Articles