ఇరకాటంలో పాక్.. యూరీ దాడి మా పనేనంటూ పోస్టర్లు | Lashkar-e-Taiba claims responsibility in posters on Uri attack

Lashkar e taiba claims responsibility in posters on uri attack

Lashkar-e-Taiba claims responsibility in posters on Uri attack, Gujranwala town posters Uri Attack, Uri attack posters in Punjab Provence, Uri Attack posters in Pak, Pak uri attacker rites in Pak posters, LeT posters on Uri Attack

Lashkar-e-Taiba claims responsibility in posters on Uri attack.

యూరీ దాడిపై పాక్ లో సంచలన పోస్టర్లు

Posted: 10/25/2016 03:38 PM IST
Lashkar e taiba claims responsibility in posters on uri attack

యూరీ ఎటాక్ లో తమ ప్రమేయం లేదంటూ వాదిస్తూ వస్తున్న పాక్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందో చూడాలి. సైనిక స్థావరంపై దాడి చేసింది ఎల్ఈటీ (లష్కరే తాయిబా) ఉగ్రవాదులే అన్న పచ్చి నిజం ఇప్పుడు బట్టబయలైంది. పాకిస్థాన్ లోని గుజ్రాన్ వాలాలో నడిరోడ్డుపై వెలిసిన పోస్టర్లే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

దాడిలో భారత సైనికుల చేతిలో హతమైన నలుగురు ఉగ్రవాదులలో ఒకడైనా మహ్మద్ అనాస్ అలియాస్ అబూ సిరాఖా అంత్యక్రియల సందర్భంగా స్వస్థలం బాదానుల్లాలో నిర్వహించే ప్రత్యేక నమాజ్ కు హాజరు కావాలని స్థానికులను ఆహ్వానిస్తూ సందేశంతో ఆ పోస్టర్లు వెలిశాయి. పోరాట యోధుడైన అబూ సిరాఖా యూరీ క్యాంపులోని 177 మంది హిందూ సైనికులను నరకానికి పంపాడని (వాస్తవానికి ఉరీ దాడిలో 20 మంది సైనికులే మరణించారు), మతం కోసం ప్రాణ త్యాగం చేశాడని పోస్టర్ పై పేర్కొన్నారు.

పంజాబ్ ప్రొవిన్స్ లోని గార్ జాఖ్ సమీపంలోని బాదానుల్లా ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నమని, అబూ మృతదేహం లేకుండానే అంత్యక్రియలు జరుపుతున్నామని తెలిపారు. అంతేకాదు అబూ సిరాఖా ఫొటోనే కాకుండా, లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఫొటోను కూడా ఉంచారు. ఈ వార్తను ఓ ప్రముఖ జాతీయ పత్రిక ధృవీకరించగా, ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

మరోవైపు, యూరీ దాడి జరిగిన వెంటనే... అది జైషే మొహమ్మద్ పనేనని భారత్ ఆరోపించింది. అయితే, తాజా పోస్టర్లతో ఆ దాడులకు పాల్పడించి లష్కరే తాయిబా అనే విషయం వెల్లడైంది. ఈ పోస్టర్లతో, ఉరీ ఉగ్రదాడి లష్కరే తాయిబా పనే అనే విషయం తేటతెల్లమైంది. కాగా, ఉగ్రదాడితో ఇప్పటిదాకా తమకు సంబంధం లేదని చెబుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధాని నవాజ్ షరీఫ్  ఇప్పుడేం చెబుతారో చూద్దాం.

LeT posters on Uri attack in Pak

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uri Attack  Posters in Pak  Gujranwala  LeT claim Uri Attack  

Other Articles