ఇంటికోసం కోర్టుకెక్కిన ప్రముఖ హీరో hero Darshan moves HC

Darshan gets notice at doorstep asked to vacate house in 15 days

Kannada actor, kannada hero Darshan Thogudeepa, Rajarajeshwari Nagar, west Bengaluru, notices to vacate their homes, buildings demolish, encroachment, storm water drains, karnataka high court, sandal wood

Kannada film actor Darshan moved the High Court questioning the notice issued by the district administration threatening to evict him from his property at Ideal Homes Layout in Rajarajeshwarinagar

ఇంటికోసం కోర్టుకెక్కిన ప్రముఖ హీరో

Posted: 10/25/2016 10:18 AM IST
Darshan gets notice at doorstep asked to vacate house in 15 days

నిత్యం సినిమా షూటింగ్ లలో బిజీగా వుండే శాండల్ వుడ్ నటుడు దర్శన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. తన ఇంటికోసం ఆయన చివరకు హైకోర్టు మెట్లు ఎక్కక తప్పిన పరిస్థితి ఉత్పన్నమైంది. పశ్చిమ బెంగళూరు పట్టణంలోని రాజరాజేశ్వరి నగర ఐడియల్‌ హోమ్‌ లేఔట్‌ లో ఆయన తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ ప్రాంతాన్నంతా అక్రమ నిర్మాణంగా తేల్చిన జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆస్తిగా గుర్తించింది. దీంతో తాము రాజకాలువ కబ్జాకు పాల్పడి నిర్మించలేదని, నిర్మాణాలు జరుగుతున్న క్రమంలోనే అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం తాము ఇళ్లను నిర్మించుకున్న తరువాత ఖాళీ చేయాలని అదేశించడాన్ని ప్రశ్నిస్తూ ఆయన రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించారు.

కాగా దర్శన్‌ 2,100 చదరపు అడుగుల స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు నిర్మించినట్లు అధికార యంత్రాంగం నివేదిక అందించింది. ఈ నేపథ్యంలో ఈనెల 22న బెంగళూరు జిల్లా యంత్రాంగం ఈ లేఔట్‌లో 44 ఇళ్లకు ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించి బోర్డు పెట్టింది. ఇందుకు సంబంధించి దర్శన్ తో పాటుగా అక్రమ నిర్మాణదారులందరికీకు నోటీసులు కూడా అందించింది. 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా యంత్రాంగం తీరుపై నటుడు దర్శన్‌ మండిపడ్డాడు. అధికార యంత్రాంగం తీరుపై అక్రోశాన్ని వెళ్లగక్కుతూనే.. అయన వారిపై న్యాయపోరాటానికి సిద్దమయ్యారు. ఈ మేరకు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles