మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. తృటిలో తప్పించుకున్న అగ్రనేతలు 24 Maoists killed in encounter with security forces in Odisha

24 maoists killed in encounter with security forces in odisha

maoists, AOB area, odisha andhra pradesh border, encounter, malkangiri, maoists killed, odisha maoists, news, odisha andhra pradesh maoists, top maoists killed, top naxals killed, news, india news

23 members of the banned CPI (Maoist) were killed in an encounter with a combined team of the Andhra Pradesh and Odisha police near Jantri in Malkangiri district of Odisha,

మళ్లీ ఎదురుకాల్పులు.. పోలీసులపై తిరగబడుతున్న మావోయిస్టులు..

Posted: 10/24/2016 01:18 PM IST
24 maoists killed in encounter with security forces in odisha

తమ నాయకులను సహచరుటను భారీ సంఖ్యలో కోల్పోయిన మావోయిస్టులు పోలీసులపైకి ప్రతిదాడులతో తిరగబడుతున్నారు. దీంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మళ్లీ కాల్పులు మొదలయ్యాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య పైరింగ్ జరుగుతోంది. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు గ్రేహౌండ్స్ బలగాలు, పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలంలో 50కిట్ బ్యాగులు ఉండగా, మరణించింది కేవలం 23 మంది కావడంతో పోలీసులు మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు.

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి బలిమెల రిజర్వాయర్ నుంచి పడవలో మావోలు నదిని దాటి వెళ్లివుంటారని  గ్రేహౌండ్స్ బలగాలకు సమాచారం అందింది. దీంతో గ్రేహౌండ్స్ బలగాలు ఉదయం నుంచి కూంబింగ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమంది మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే గ్రేహౌండ్స్‌కు చెందిన కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

కాగా నిన్న అర్థరాత్రి దాటిన తరువాత జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఏఓబీలో మావోలు ప్లీనరి నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసిన గ్రేహౌంట్స్ పోలీసులు.. ఏకంగా 24 మంది మావోయిస్టులను హతమార్చారు. కాగా ఈ దాడుల నుంచి మావోయిస్టు అగ్రనేత అర్కే సహా మరికోందరు తృటిలో తప్పించుకున్నారని సమాచారం. అంద్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మల్కాన్‌గిరి అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన హోరా హోరీ కాల్పులు జరిగాయి.

ఏవోబీలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతున్నట్లు ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన గ్రే హౌండ్స్‌ ప్లీనరీపై పక్కా స్కెచ్‌తో దాడి చేసింది. మృతుల్లో ప్రముఖ మావోయిస్టులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.  గ్రేహౌండ్స్ బలగాలు అటవీప్రాంతంలోని తొమ్మిది కిలో మీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి మరీ ఈ దాడి చేసినట్లు సమాచారం. మావోయిస్టుల నుంచి మూడు ఏకే-47గన్స్‌, ఏడు ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఏడు ల్యాండ్‌మైన్లు, 303 రైఫిల్స్‌,  15 భారీ ఆయుధాలను  స్వాధీనం చేసుకున్నారు.

జంత్రి అటవీప్రాంతం ఘటనలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా పక్కా సమాచారం తెలుసుకున్న ఆంధ్ర-ఒడిశా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టేందుకు రంగంలోకి దిగారు. బలిమెల రిజర్వాయర్‌లోని ఏవోబీ కటాఫ్ ఏరియా జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే ప్లీనరీ జరుగుతున్న సమావేశంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. మావోయిస్టులు ఆయుధాలతో తేరుకునేలోపే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లకు గాయపడ్డారు.

పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. విశాఖ ఏరియా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గాజర్ల రవి అలియాస్ గణేష్, చలపతి, దయ, రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్,మల్లేష్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల సమయంలో మరో అగ్రనేత ఆర్కే తప్పించుకోగా, ఆయన మనవడు మున్నా ఎన్కౌంటర్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత కొంత కాలంగా స్తబ్తుగా మావోయిస్టులు పట్టు కోల్పోయిన ఏవోబీలో మళ్లీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maoists  AOB area  odisha andhra pradesh border  encounter  malkangiri  

Other Articles