తండ్రి, బాబాయ్ ఎదుటే అబ్బాయ్ కంటతడి, పార్టీ వార్తలను ఖండించిన ముఖ్యమంత్రి Akhilesh breaks down, says will not form new party

Samajwadi party internal imbroglio akhilesh says no new party

akhilesh yadav, samajwadi party, uttar pradesh, shivpal yadav, mulayam singh yadav, amar singh, shivpal yadav sacked, ramgopal yadav, akhilesh sacks shivpal yadav, uttar pradesh politics, uttar pradesh elections, up assembly elections, uttar pradesh assembly elections, up polls, up votes, samajwadi party

Uttar Pradesh chief minister Akhilesh Yadav+ on Monday said that he will not form a "new party"+ and will remain with Samajwadi Party chief Mulayam Singh Yadav.

తండ్రి, బాబాయ్ ఎదుటే అబ్బాయ్ కంటతడి, పార్టీ వార్తలను ఖండించిన ముఖ్యమంత్రి

Posted: 10/24/2016 12:39 PM IST
Samajwadi party internal imbroglio akhilesh says no new party

మరికోన్ని నెలల వ్యవధిలో ఎన్నికలకు వెళ్లాల్సిన నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీని మాత్రం ఇంకా సంక్షోభం వీడటం లేదు. పార్టీలో సంక్షోభానికి అమర్ సింగ్ కారణమంటూ ముఖ్యమంత్రి అఖిలేష్ సహా అతని వర్గం అరోపణలు గుప్పిస్తూన్న తరుణంలోనే మొత్తం ఇతివృత్తంపై ఎట్టకేలకు ఆయన మౌనం వీడారు. తనకు తన తండ్రికీ మధ్య ఎలాంటి విభేధాలు లేవని, అదే సమయంలో తాను నూతన పార్టీని స్థాపించనున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండించారు.

ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన అఖిలేష్ యాదవ్.. లక్నోలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కంటతడి పెట్టారు. తన తండ్రి కోరితే తాను ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్దమేనని ప్రకటించారు. తాను ముఖ్యమంత్రి కాదని ఎస్సీ సీనియర్ నేత అమర్ సింగ్ గత నవంబర్ లో చేసిన వ్యాఖ్యాలు తనను బాధించాయని చెప్పారు. రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలు చేయకపోయినా అతనిపై చర్యలు తీసుకున్నారని వాపోయారు.

పార్టీ సమావేశంలో శివపాల్ యాదవ్ ప్రసంగించేందుకు లేవగానే అఖిలేశ్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అయన సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్, తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ల మద్దతుదారుల మధ్య కొట్లాట జరిగింది. ఒకరినిమించి ఒకరు నినాదాలు చేసిన ఇరువర్గాల ఘర్షనాత్మక వాతావరణాకి దిగాయి. తోపులాటకు కూడా కార్యకర్తలు దిగారు. దీంతో భద్రతా దళాలు, పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారు.

దీంతో అఖిలేశ్ జోక్యం చేసుకుని.. 'ఇక్కడ చాలా మంది అయోమయాన్ని సృష్టిస్తున్నారు. ముందుగా ములాయం, శివపాల్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ములాయం బాటలో నడుస్తున్నాం..  ఆ మార్గంలో వీలైనన్ని విజయాలు సాధించాను. అన్యాయాన్ని ఎదుర్కొమని నా తండ్రి నాకు బోధించారు. ఆయన ఆదేశాలను శిరసావహించాను. పార్టీలో జరిగిన కుట్రపై తప్పకుండా విచారణ జరిపిస్తానన్నారు. కాగా పార్టీ అధినేత నేతాజీ (ములాయం) మనసులో ఏముందో తెలుసుకోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నార'ని అఖిలేశ్ యాదవ్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles