తానా.. చంద్రబాబు తందానా మ్యాటర్ లో అసలు విషయం ఏంటంటే... | TANA president Jampala says funds not misused

Tana president jampala says funds not misused

TANA funds not misuse, Allegations on Komati jayaram, AP TANA special representative Jayaram, TANA president Jampala Chowdary clear air on Funds misusing, TANA funds AP government, Chandrababu TANA tandana, Digital schools TANA funds to AP govt

TANA president Jampala Chowdary gives a statement on funds Misusing. says Hudhud funds were still in Account.

తానా అవినీతి ఆరోపణల్లో సరికొత్త మలుపు

Posted: 10/24/2016 12:15 PM IST
Tana president jampala says funds not misused

తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంఘం (తానా) పై వస్తున్న అవినీతి ఆరోపణలు సరికొత్త మలుపు తిరిగింది. సంఘంలోని మిగతా సభ్యులకు చెప్పకుండా సొమ్మును పక్కదారి పట్టించారని కొందరు ఆరోపణలకు దిగటంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విషయం ఏంటంటే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్ గా డిజిటల్ తరగతుల కోసం ఎన్నారైల నుంచి విరాళాలను ఆహ్వానించింది. దీనికి తానా 4.50 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. అమెరికాలో ఏపీ ప్రతినిధిగా ఉన్న జయరాం కోమటి ఆ చెక్కును రీసెంట్ గా సీఎం చంద్రబాబుకు అందజేశాడు కూడా.

అయితే ఈ భారీ విరాళం వెనుక గోల్ మాట్ ఉందంటూ ఆరోపణలు వినిపించాయి. గతంలో హుధూద్ కోసం సేకరించిన ఈ విరాళాలను ఇప్పుడు ఈ కార్యక్రమానికి వినయోగించారంటూ ఆరోపణలు వినిపించాయి. తానా మాజీ అధ్యక్షుడు నన్నపనేని మోహన్ హయాంలో అప్పటి పూర్వపు విద్యార్థులంతా కలిసి విశాఖ హుద్‌హుద్ తుపాను బాధిత ప్రాంతాల్లో గృహాలు, పాఠశాలల నిర్మాణానికి సుమారు 3 లక్షల 6 వేలడాలర్లు (రూ. 2 కోట్లు) నిధులు సేకరించి తానా ఫౌండేషన్‌కు అందజేశారు. అయితే ఆ సొమ్మునే ఇప్పుడిలా వాడుతున్నరన్నది అసలు ఆరోపణ. కానీ, ఆ సొమ్ము ఇప్పటికీ ఆయా ఖాతాల్లోనే పదిలంగా ఉన్నాయని చెబుతున్నారు తానా అధ్యక్షుడు జంపాలచౌదరి. ఈ నిధుల్లో సగం డిజిటల్ తరగతులకు, మిగిలిన సగం అంగన్‌వాడీ కేంద్రాలకు వెచ్చించాలని జులై 13న తానా కార్యవర్గం నిర్ణయించినట్టు ఆయన చెప్పుకొచ్చారు.

అది పక్కనబెడితే తానా మాజీ అధ్యక్షుడు మోహన్ నన్నపనేని అమెరికావ్యాప్తంగా పర్యటించి మరో లక్షా 5 వేల డాలర్లను ప్రవాసుల నుంచి సేకరించారు. మరో 75 వేల డాలర్లు ఎన్నారైల నుండి హామీలు కూడా లభించాయి. ఇదిలావుండగా లక్షా 5 వేల డాలర్లకు, తానా సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, కాకపోతే భారతదేశం - అమెరికా ప్రభుత్వాల నుండి సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం తానాకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

ప్రవాస తెలుగు ప్రజలు అందించిన లక్షా 5వేల డాలర్లను తానా ఫౌండేషన్ ద్వారా భారత్‌కు తరలించారు. మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న జయరాం కోమటి తొలివిడతలో ఏపీలో 1000 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రతి పాఠశాలకు 45 వేల రూపాయిల ఖర్చును ప్రవాసులు భరిస్తే.. మిగతా ఖర్చంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ఆ లెక్కన్న 1000 స్కూళ్లకు 45 వేల చొప్పున రూ.4.5 కోట్లు. ఈ మేరకు అనధికారిక చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. అంటే ఆ రూ.4.5 కోట్లు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకు ముందస్తు హామీ మాత్రమే!

TANA funds for Digital Schools Komati Jayaram

ఇక ప్రభుత్వానికి ఆ రోజున విశాఖలో ఇచ్చిన అసలు మొత్తం సుమారు రూ.75లక్షలు(లక్షా 5 వేల డాలర్లు) మాత్రమే. ఈ లక్షా 5వేల డాలర్లు కాకుండా జయరాంకు అమెరికాలో తన పర్యటనల్లో ప్రవాసులు మరో 75 వేల డాలర్లు అందిస్తామని వాగ్దానాలు చేశారు. ఆ నిధులు సేకరించిన అనంతరం వాటిని కూడా ప్రభుత్వానికి అందిస్తారని జంపాల లెక్కలతోసహా వివరించారు. దీంతో తానా నిధుల గోల్ మాల్ అంతా ఉత్తదేనని తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TANA funds  Digital Schools Donation  Jayaram Komati cheque  not misuse funds  

Other Articles