మళ్లీ వార్తల్లోకి అమర్ సింగ్.. సంక్షోభానికి కారకుడు అయనేనట.. Akhilesh Yadav camp goes after 'anti-social' Amar Singh

Akhilesh yadav camp goes after anti social amar singh

akhilesh yadav, samajwadi party, uttar pradesh, shivpal yadav, mulayam singh yadav, amar singh, shivpal yadav sacked, ramgopal yadav, akhilesh sacks shivpal yadav, uttar pradesh politics, uttar pradesh elections, up assembly elections, uttar pradesh assembly elections, up polls, up votes, samajwadi party

Amar Singh has been the target of the Akhilesh camp since differences within the family hit a peak last month, with Mulayam Singh Yadav replacing Akhilesh with Shivpal as party state president.

మళ్లీ వార్తల్లోకి అమర్ సింగ్.. సంక్షోభానికి కారకుడు అయనేనట..

Posted: 10/24/2016 09:34 AM IST
Akhilesh yadav camp goes after anti social amar singh

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన సమయంలో ఇంటిపోరుతోనే ఇంకా సతమతం అవుతున్న సమాజ్ వాదీ పార్టీలో అగాధం ఏర్పడటానికి కారణం గతంలో చక్రం తిప్పిన సీనియర్ నేత అమర్ సింగ్ అని అరోపణలు వస్తున్నాయి. తమ పార్టీలో సంక్షోభానికి పూర్తి కారణం అమర్ సింగ్ దేనని ఏకంగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అరోపణలు గుప్పించారు. తమ కుటుంబంలో కలహాలకు అమర్ సింగే కారణమని ఆరోపించారు. తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆయన కుట్రపన్నారని అఖిలేష్ అన్నారు.

ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కొంతకాలంగా ఉన్న విబేధాలు ఆదివారం తారస్థాయికి చేరుకున్నాయి. బాబాయ్ శివపాల్ సహా నలుగురు మంత్రులపై ఈ రోజు అఖిలేష్ వేటు వేశారు. అమర్ సింగ్కు సన్నిహితురాలైన సినీ నటి జయప్రదను ఎఫ్డీసీ పదవి నుంచి తొలగించారు. అనంతరం అఖిలేష్ తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అనంతరం ఆవేశంగా మాట్లాడిన అఖిలేష్.. అమర్ సింగ్ మద్దతుదారులు తమ మద్దతు దారులు కారని అన్నారు.

అటు సమాజ్ వాదీ బహిష్కృత నేత, ముఖ్యమంత్రి అఖిలేష్ సన్నిహితుడు ుదయ్ వీర్ సింగ్ కూడా అమర్ సింగ్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. బీజేపితో కుమ్మకై.. ములాయం కుటుంబంలో ముసలం ఏర్పడేలా చేసింది అయననేనని అరోపణలు గుప్పించారు. కుటుంబ విలువలు, అంతర్గత ఈర్ష్యద్వేషాల సాకుతో అఖిలేశ్ యాదవ్‌ను బలహీనుడిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన మరోసారి అధికారంలోకి రాకుండా ఈ కుట్ర పన్నారని అరోపించారు. ఎస్పీలో మళ్లీ చేరినప్పటికీ అమర్‌సింగ్‌ ఇంకా బీజేపీ నేతలను కలుస్తున్నారని, బీజేపీ నేతలు,  వ్యక్తులు ఇచ్చే పార్టీలకు ఆయన హాజరవుతున్నారని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles