ట్రంప్ పై అంతకంతకూ పెరుగుతున్న లైంగిక అరోపణలు Latest Trump accuser says he hugged, kissed her without permission

Adult film star jessica drake accuses donald trump of sexual misconduct

Jessica Drake, adult film star, sex educator, lawyer Gloria Allred, Donald Trump, US presidential elections, republican party, democratic party, hillary clinton

The latest comes from adult film star and sex educator Jessica Drake, who said at a press conference on Saturday that Trump had hugged and kissed her without asking at a golf tournament ten years ago.

ట్రంప్ పై అంతకంతకూ పెరుగుతున్న లైంగిక అరోపణలు

Posted: 10/24/2016 09:05 AM IST
Adult film star jessica drake accuses donald trump of sexual misconduct

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది అంకం దెగ్గరవుతున్న సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఆరోపణలు గుప్పిస్తున్న మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే పది మంది మహిళలు తమను ట్రంప్ లైంగికంగా వేదించాడని అరోపించగా, తాజాగా శృంగార చిత్రాల నటి(అడల్ట్ యాక్ట్రెస్) జెసికా డ్రాకే తెర ముందుకు రావడంతో ఈ సంఖ్య 11 కు చేరింది. తన పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, తనతో ఏకాంతంగా గడపాలని ఒత్తిడి చేశారని జెసికా ఆరోపించింది.

తనను బలవంతంగా ముద్దు పెట్టారని, తన అనుమతి లేకుండా హత్తుకుని కౌగలించుకున్నారని అరోపించింది. ప్రముఖ న్యాయవాది గ్లోరియా ఆల్డ్రెడ్ తో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2006లో కాలిఫ్నోరియాలోని లేక్ టాహోయ్ గోల్ఫ్‌ టోర్నమెంట్ లో తనకు ట్రంప్ పరిచమయ్యారని జెసికా తెలిపింది. తర్వాత ట్రంప్ ఆహ్వానం మేరకు మరో ఇద్దరు మహిళలతో ఆయన హోటల్ గదికి వెళ్లానని వెల్లడించారు.

'మేము వెళ్లేసరికి ట్రంప్ పైజామా దస్తుల్లో ఉన్నారు. దగ్గరికి వచ్చి ఒక్కొక్కరినీ గట్టిగా కౌగిలించుకున్నారు. మా అనుమతి లేకుండానే ముద్దు పెట్టుకున్నారు. పోర్నోగ్రఫీ గురించి కూడా మాట్లాడారు. అక్కడి నుంచి నా గదికి తిరిగొచ్చాక తాను బసచేసిన హోటల్ గదికి రావాలని మరోసారి ట్రంప్ ఆహ్వానించారు. పార్టీకి రావాలని కూడా కోరారు. నీకు ఏం కావాలి, ఎంత కావాలని అడిగారు. నేను తిరస్కరించడంతో ట్రంప్ లేదా ఆయన తరపు వ్యక్తి నాకు 10 వేల డాలర్లు ఆఫర్ చేశారు. దీనికి ఒప్పుకుంటే ట్రంప్ వ్యక్తిగత విమానంలో తన ఇంటి నుంచి లాస్ ఏంజెలెస్ తీసుకెళతామని చెప్పార'ని జెసికా వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles