పూర్తిగా నిజం.. జీవితకాలం ఉచితం: జియో Reliance Jio's free call offer gets Trai clean chit

Reliance jio s free call offer gets trai clean chit

reliance jio, rjio, jio, jio free 4g voice calls, jio 4g free calling, jio 4g free data, jio welcome offer, bharti airtel, vodafone, reliance jio offer, tech news, technology

Reliance Jio said that the free service, including unlimited mobile data, will be available for its subscribers till December 31

పూర్తిగా నిజం.. జీవితకాలం ఉచితం: జియో

Posted: 10/24/2016 08:57 AM IST
Reliance jio s free call offer gets trai clean chit

రిలయన్స్ జియో ‘ఫ్రీ వాయిస్ కాల్స్’ ఆఫర్ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని, వాయిస్ కాల్స్ పూర్తి ఉచితమని జియో మరోమారు స్పష్టం చేసింది. సంచలన ఆఫర్‌పై వస్తున్న సందేహాలను నివృత్తి చేసింది. టెలికం రెగ్యులేటరీ ఆమోదించిన టారిఫ్ ప్లాన్లలో జియో ఉచిత కాల్స్ గురించి లేకపోవడంతో జియో వినియోగదారుల్లో అయోమయం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వినియోగదారుల్లో ఉన్న అనుమానాలను తొలగించింది. అందులో భాగంగా నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.
 
అవును, జియో ద్వారా అన్ని కాల్స్ జీవిత కాలం ఉచితంగా చేసుకోవచ్చు. ఈ విషయంలో వినియోగదారుల నుంచి ఎటువంటి చార్జీలు వసూలు చేయబోమని జియో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఉచిత కాల్స్ ఆఫర్ పది ప్రీపెయిడ్, ఏడు పోస్టు పెయిడ్ టారిఫ్ ప్లాన్లకు అందిస్తున్నట్టు ట్రాయ్‌కు సమర్పించిన పత్రాల్లో జియో పేర్కొంది. ఆ ప్యాకేజీలను మార్చుకున్నా వాయిస్ కాల్స్ విషయంలో మాత్రం ఎటువంటి తేడా ఉండదని స్పష్టం చేసింది.
 
ఫ్రీ కాల్స్.. జియో ప్రమోషనల్ ఆఫర్‌లో భాగమని ట్రాయ్ స్పష్టం చేసింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ప్రమోషన్ ఆఫర్ 90 రోజులకు మించి ఉండకూడదు. జియో ఆఫర్ సెప్టెంబరు 5న ప్రారంభమైంది. కాబట్టి నిబంధనల ప్రకారం డిసెంబరు 3న ముగుస్తుంది. లోకల్, ఎస్టీడీ కాల్స్‌పై సెకనుకు రెండు పైసలు చొప్పున నిమిషానికి రూ.1.20 వసూలు చేయనున్నట్టు జియో తన బేస్ టారిఫ్ ప్లాన్‌లో పేర్కొన్న విషయాన్ని ట్రాయ్ అధికారులు గుర్తు చేస్తున్నారు. అయితే రెగ్యులేటర్‌కు సమర్పించిన అన్ని టారిఫ్ ప్లాన్లు బేస్ ప్లాన్లకు అదనమని, ఉచిత కాల్స్ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు జియో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles