ఆ మూడు టెలికాం సంస్థలకు భారీ జరిమానా TRAI wants Jio rivals to pay Rs. 3050 crore fine

Trai recommends rs 3050 crore fine on airtel vodafone and idea

trai, reliance jio, trai fines airtel, trai fines vodafone, idea, vodafone, airtel, trai penalty, telecom, jio infocomm, rjio, airtel fined, vodafone fined, idea fined, department of telecommunications, telecom quality of service, technology, technology news

Trai recommends Rs 3,050-crore fine on Airtel, Vodafone and Idea, While a fine of Rs 50 crore each for 21 circles.

ఆ మూడు టెలికాం సంస్థలకు భారీ జరిమానా

Posted: 10/24/2016 08:56 AM IST
Trai recommends rs 3050 crore fine on airtel vodafone and idea

రిలయన్స్ జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు మొబైల్ పోర్టబిలిటీని వినియోగదారులు వినితి మేరకు కల్పించకుండా పెండింగ్ లో పెడుతున్నట్లు అభియోగాలను ఎదుర్కోంటున్న దిగ్గజ టెలికాం ఆపరేటర్లకు షాకిస్తూ ట్రాయ్‌ సంచలన సిఫార్సు చేసింది. రిలయన్స్‌ జియోకు ఉద్దేశపూర్వకంగా ఇంటర్‌ కనెక్టివిటీని కల్పించేందుకు నిరాకరిస్తున్నారని పేర్కొంటూ ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌పై 3,050 కోట్ల రూపాయల జరిమానా విధించాలని టెలికం శాఖకు సిఫార్సు చేసింది. లైసెన్సు కండీషన్లు, సేవల నాణ్యతా నిబంధనలను ఈ మూడు కంపెనీలు పాటించడం లేదని ట్రాయ్‌ పేర్కొంది.

వీటి కారణంగా ఆర్‌జియోకు కేటాయించిన ఇంటర్‌ కనెక్ట్‌ పాయింట్ల వద్ద సమస్యలు ఏర్పడి కాల్స్‌ ఫెయిల్యూర్లు భారీగా జరగుతున్నాయని తెలిపింది. ఆర్‌జియోకు పోర్టులు కేటాయించేందుకు ఈ కంపెనీలు తిరస్కరించడం పోటీని పరిమితం చేయడమేనని, ఈ చర్య వినియోగదారులకు వ్యతిరేకమైనదని ట్రాయ్‌ విమర్శించింది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌కు ఒక్కొక్క కంపెనీకి 1,050 కోట్ల రూపాయల చొప్పున, ఐడియాకు 950 కోట్ల రూపాయల చొప్పున జరిమానా విధించాలని సిఫార్సు చేసింది.

ఈ మూడు కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలని కానీ వినియోగదారులకు ఏర్పడే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పని చేయడంలేదని తెలిపింది. తమ నెట్‌వర్క్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌లో 75 శాతం కాల్స్‌ ఫెయిల్‌ అవుతున్నాయని, ఇందుకు ఈ కంపెనీలు తగినన్ని పోర్టులు కేటాయించకపోవడమే కారణమని ఆర్‌జియో చేసిన ఫిర్యాదుపై ట్రాయ్‌ విచారణ జరిపింది. ఈ కంపెనీల చర్య ప్రజా ప్రయోజన వ్యతిరేకమైనదని డిఒటికి రాసిన లేఖలో ట్రాయ్‌ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trai  Rs 3050-crore fine  Airtel  Vodafone  Idea  

Other Articles