ఒబామా పర్సనల్ ఈ మెయిల్స్ ను లీక్ చేసిన వికీలీక్స్ Wikileaks releases Barack Obama's e-mails from 2008

Wikileaks reveals us president barack obamas personal email id

WikiLeaks, US president Obama, Obama's e-mail address, John Podesta, G-20 meeting in 2008, Clinton e-mails, hacked emails, Cyber Attack, John Podesta, Mike Froman

The emails are from 2008 when Barack Obama just before and around the time he was elected President of the United States.

ఒబామా గుట్ రట్టు.. కసి తీర్చుకున్న వికీలీక్స్

Posted: 10/24/2016 08:49 AM IST
Wikileaks reveals us president barack obamas personal email id

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒమాబా వ్యక్తిగత ఈ-మెయిల్స్ను వీకీలీక్స్ బయటపెట్టింది. ఆయన వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్ నుంచి పంపిన సందేశాన్ని వీకీలీక్స్ బహిర్గతం చేసింది. రహస్య చిరునామా ద్వారా ఒబామా పంపిన మెయిల్స్ లో కొన్నింటిని తొలి విడతగా బయటపెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాలను వీకీలీక్స్ ట్విట్టర్ లో పేర్కొంది. కాగా This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. నుంచి ఒబామా పంపిన ఏడు సందేశాలను వీకీలీక్స్ తన వెబ్ సైట్లో ప్రచురించిందంటూ న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.

వీటిలో జి-20 సమావేశాలకు వెళ్లొద్దంటూ 2008 ఎన్నికల సందర్భంగా ఒబామా బృందంలోని జాన్‌ పొడెస్టా పంపిన మెయిల్‌ కూడా ఉంది. 2008 నవంబర్‌ 4న పొడెస్టా ఈ మెయిల్ పంపించారు. ఇప్పటికే హిల్లరీ క్లింటన్ ఈ మెయిళ్ల వ్యవహారంతో డెమోక్రటిక్ పార్టీకి తల బొప్పి కడుతోంది. ఇప్పుడు ఏకంగా ఒబామాకు సంబంధించి ఈ మెయిల్స్ బహిర్గతం కావడంతో డెమోక్రాట్లు ఆందోళనకు గురవుతున్నారు. పొడెస్టా ప్రస్తుతం హిల్లరీ ప్రచార బృందం సారధిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు చెందిన దాదాపు 23 వేల ఈమెయిల్స్‌ అపహరణకు గురయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WikiLeaks  US President Barack Obama  private emails  

Other Articles