పట్టాలు తప్పి, పల్టీ కోట్టిన రైలు.. 55 మంది మృతి At least 55 killed in Cameroon train derailment

At least 55 killed in cameroon train derailment

train, derailment, overturned, train crash, train overturned, train derail in cameroon, cameroon train derail, train derail, africa train derail, cameroon train derail death toll, world news

At least 53 people were killed and nearly 300 injured when an overloaded passenger train travelling between Cameroon's two largest cities capital Yaounde with economic hub Douala, derailed and overturned.

పట్టాలు తప్పి, పల్టీ కోట్టిన రైలు.. 55 మంది మృతి

Posted: 10/22/2016 09:33 AM IST
At least 55 killed in cameroon train derailment

దక్షిణాఫ్రికాలోని కామోరూన్ పట్టణానికి సమీపంలో ఘోర రైలు ప్రమాదం సంభివించింది. కామెరూన్ లోని రెండు ప్రధాన నగరాలైన  యాండీ, దౌలాల  మద్య నడుస్తున్న రైలు మార్గం మధ్యలో ఎసెకా పట్టణం వద్ద ప్రమాదానికి గురైంది. రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం సంభవించడంతో పాటు పల్టీ కోట్టింది. ఈ ప్రమాదంలో 55 మంది దుర్మరణం చెందారు. మరో 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న రెస్కూ టీమ్ అధికారులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను స్థానికి అస్పత్రులకు తరలించారు.

రైలు ప్రమాదానికి కారణమిదేనా..?

కామెరూన్ లోని రెండు వాణిజ్య నగరాలు  యాండీ, దౌలలకు మధ్య వున్న ప్రదాన రోడ్డు మార్గంలో ఓ వంతెన కూలిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా ప్రయాణికులు రైలు మార్గాన్ని ఆశ్రయించారు. ప్రయాణికులు అధికంగా వుంటారని భావించిన రైల్వే అధికారులు రైళ్లను పెంచడానికి బదులు, రైలు బోగీలను పెంచడంతోనే.. అసలు సామర్థ్యానికి రెండింతలు ప్రయాణికులతో బయలుదేరిన ప్యాసింజర్ రైలు మార్గం మధ్యలో ఘోర ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పి బొల్లా పడడంతో బోగీలు ఒకదానిపై ఒకటి కుప్పలా పేరుకుపోయాయి.  

ఓవర్ లోడ్ కారణంగానే రైలు ప్రమాదనాకి గురైందా..? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ప్రయాణికులు అదికంగా వున్న సమయంలో అదనపు రైళ్లను నడపడానికి బదులు.. కేవలం అదనపు బోగీలను వేయడమే ప్రమాధానికి కారణంగా కావచ్చునని పలువురు భావిస్తున్నారు. కామెరూన్ పశ్చిమ ప్రాంతంలోని యాండీ పట్టణం నుంచి దౌలా నగరానికి పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతుంటాయి. సాధారణ రోజుల్లో తొమ్మిది బోగీలతో గరిష్టంగా 600 మంది ప్రయాణించేవారు. కానీ వంతన కూలిన కారణంగా రద్దీ ఎక్కువ ఉండటంతో తొమ్మిది బోగీలకు మరో ఎనిమిది అదనపు బోగీలను కలిపి మొత్తం 17 బోగీల ద్వార 1300 మంది ప్రయాణికులతో రైలును నడిపారు. ఇదే ప్రమాదానికి కారణమైందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : train  derailment  overturned  train crash  Yaounde  Douala  camaroon  south africa  

Other Articles