సమగ్ర దర్యాప్తుకు అదేశించాం.. అందోళన వద్దు SBI Blocks Millions of debit

Banks allay fears of users over atm card security

Debit Card Theft, Finance Minister, Arun Jaitley, massive data breach, Shaktikanta Das, ATM systems, National Payments Corporation of India, SBI, RBI

Finance Minister Arun Jaitley said today that he has sought a report on the misuse of debit cards after a massive data breach compromised over 3 million cards. "The idea is to contain damage," Mr Jaitley said.

సమగ్ర దర్యాప్తుకు అదేశించాం.. అందోళన వద్దు

Posted: 10/21/2016 09:07 PM IST
Banks allay fears of users over atm card security

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డెబిట్ కార్డుల కుంభకోణంపై దేశప్రజలెవ్వరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బ్యాంకుల డెబిట్ కార్డు డాటా వెళ్లిందన్న అరోపణలు వెల్లువత్తడంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామి ఇచ్చారు. ఈ కుంభకోణంపై నివేదిక సమర్పించాల్సిందిగా ఇప్పటికే ఆర్బీఐని కోరినట్లు తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్ దర్యాప్తులో నిపుణుల చేత డెబిట్ కార్డ్ కుంభకోణంపై విచారణ జరిపిస్తామని జైట్లీ అన్నారు.

భారతీయులు వాడుతున్న డెబిట్ కార్డుల వివరాలు అక్రమార్కులకు చేతికందాయిని వాటిలో 19 బ్యాంకులకు చెందిన కస్టమర్ల వివరాలు వున్నాయన్న వార్తలు వస్తున్నాయి. సుమారుగా 36 లక్షల కార్డుల వివరాలను సర్వర్ల నుంచి అపహరించుకుపోయారని జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ, పరిస్థితిని శాంతింపజేసేందుకు రంగంలోకి దిగిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ.. ముందుగా నష్టనివారణ చర్యలను తీసుకునేందుకు తాము ప్రయత్నాలను చేపట్టామన్నారు.

కాగా, ఇండియాలో బ్యాంకు లావాదేవీలు పూర్తి సురక్షితమని ఆర్థిక సేవల విభాగం అదనపు కార్యదర్శి జీసీ ముర్ము వ్యాఖ్యానించారు. బ్యాంకు ఖాతాదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా దేశంలోని 99.5 శాతం కార్డుల సమాచారం అత్యంత సురక్షితంగా ఉందని, కేవలం 0.5 శాతం కార్డుల వివరాలు బయటకు వెళ్లుండవచ్చని అయన అభిప్రాయపడ్డారు. ఆయా కార్డులను మార్చే చర్యలు మొదలయ్యాయని వివరించారు.

ప్రస్తుతం ఇండియాలో 60 కోట్లకు పైగా డెబిట్ కార్డులు ఉన్నాయని, వాటిల్లో 19 కోట్ల కార్డులు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రూపే కార్డులని, మిగతావన్నీ వీసా, మాస్టర్ కార్డ్ ప్లాట్ ఫాంలపై పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. మే నెలలో హిటాచి ఏటీఎం మెషీన్ల ద్వారా లావాదేవీలు జరిపిన డెబిట్ కార్డుల వివరాలు మాత్రమే హ్యాకర్ల చేతికి వెళ్లాయని ఆయన అన్నారు. మొత్తం ఎంత నష్టం జరిగిందన్న వివరాలను గణిస్తున్నామని ముర్ము వెల్లడించారు. కాగా, సెక్యూరిటీ కారణాల దృష్ట్యా, తమ కస్టమర్లంతా ఏటీఎం పిన్ నంబరును వెంటనే మార్చుకోవాలని కెనరా బ్యాంకు ఓ ప్రకటనలో కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Debit Card Theft  Arun Jaitley  massive data breach  ATM systems  SBI  RBI  

Other Articles