కారుచౌకగా విమానయానం.. మధ్యతరగలి ప్రజలకి వరం..Centre launches UDAN for regional air connectivity

Udan scheme takes off fares capped at rs 2500 for 1 hr flights

flights, UDAN scheme, airfares, union aviation ministry, udan scheme, Ude Desh Ka Aam Naagrik, ashok gajapathi raju, regional connectivity scheme, one hour flight, flight charge 2500

Fliers on major domestic routes will soon have to shell out more for flights which fares will be capped at Rs 2,500 for half of the seats in one-hour flights.

కారుచౌకగా విమానయానం.. మధ్యతరగలి ప్రజలకి వరం..

Posted: 10/21/2016 08:25 PM IST
Udan scheme takes off fares capped at rs 2500 for 1 hr flights

స్వదేశీ విమాన ప్రయాణికులకు శుభవార్త. సామాన్య ప్రజలకు విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 'ఉడే దేస్ కా ఆమ్ నాగరిక్' (ఉడాన్) పథకం ప్రారంభమైంది. ఈ పథకం కింద చిన్న పట్టణాలకు అనుసంధానించే గంటలోపు విమాన ప్రయాణాలకు రూ.2,500 మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ పథకంలోని మొదటి విమానం జనవరిలో టేకాఫ్ తీసుకోనుంది. ఈ పథకం కింద గంటలోపు ప్రయాణానికి కేవలం రూ. 2,500 మాత్రమే వసూలు చేయనున్నారు.

వినియోగదారుల ధరల సూచికి అనుగుణంగా విమాన టికెట్ల ధరలను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. ప్రధాన రూట్లలో ప్రతి డిపార్చర్ మీద చిన్నమొత్తంలో లెవీ విధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం విమానయాన సంస్థలు అంత తేలిగ్గా జీర్ణించుకునే పరిస్థితి లేదు. దానివల్ల విమానచార్జీలు పెంచాల్సి ఉంటుందని అంటున్నాయి. అయితే లెవీ ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదు. రాబోయే రోజుల్లో దీన్ని నిర్ణయిస్తారు. అయితే దీని భారం ప్రతీ టిక్కెట్లుపై సుమారుగా అరవై నుంచి వంద రూపాయల వరకు వుండవచ్చని అంచనా.
 
ప్రపంచంలోనే ఇలాంటి పథకం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. విమానంలో కనీసం సగం సీట్లకు బిడ్డింగ్ వేయడంతో పాటు మిగిలిన వాటి ధరలు మార్కెట్ ఆధారంగా ఉండాలన్నది ఈ పథకం ఉద్దేశం. త్వరలోనే హెలికాప్టర్ సేవలు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఈ పథకంలోని మొదటి విమానం జనవరిలో టేకాఫ్ తీసుకుంటుందని అంటున్నారు.ఈ పథకం గురించి చాలా జాగ్రత్తగా అన్నీ గమనిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. ఇప్పటివరకు విమానాలు అసలు నడపని లేదా తక్కువగా నడుపుతున్న నగరాలకు కూడా విమానాలు పంపాలన్నది తమ ఉద్దేశమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles