నోట్ బుక్ లో బూతు బొమ్మలు గీసింది. ఎందుకు? | 5 year old sexually abused by priest in Brazil

5 year old sexually abused by priest in brazil

Child sexually abused by priest, Brazil Child Horrific sexual pics, Child sexually abused by priest arrested, Father Joao da Silva sexual attack, Father Joao da Silva arrested, Father Joao da Silva, sexually abused by priest, Brazil Child draws

Child sexually abused by priest in Brazil, Draws scary pics of attack in her Note Books.

ఆ ఐదేళ్ల చిన్నారి భయానక అనుభవం

Posted: 10/21/2016 01:55 PM IST
5 year old sexually abused by priest in brazil

కామం పోరలు కమ్మి వయసు తారతమ్యం లేకుండా చిన్న పిల్లలపై కూడా లైంగిక దాడులకు పాల్పడిపోతున్నారు కొందరు. అంతటి నేరాలకు ఏదో తాత్కాలిక శిక్షలు విధించేసి చేతులు దులుపుకుంటున్నాయి మన చట్టాలు. మరి నలిగిపోయిన ఆ పసిమొగ్గల పరిస్థితి ఏంటి? అసలు తమకేం జరుగుతుందో కూడా తెలియని వయసులో, అయోమయ పరిస్థితుల్లో ఆ చిన్నారులు మానసిక క్షోభకు గురైపోతున్నారు. బ్రెజిల్ లో ఓ ఐదేళ్ల చిన్నారికి ఎదురైన భయంకర అనుభం మీకోసం...

మాంటెస్ క్లారోస్ ప్రాంతానికి చెందిన జోవో డా సిల్వ అనే చర్చి ఫాదర్ ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కానీ, అది పైకి మాత్రమే. తన దగ్గరికి వచ్చే విద్యార్థినులను లైంగికంగా వేధించడం అతని మరో ప్రవృత్తి. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురిని అతని వద్దకు ట్యూషన్ కి పంపించాడు. కానీ, ఆ చిన్నారిని కూడా వదలకుండా ఆ కిరాతకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

వణికిపోయిన ఆ చిన్నారి అప్పటి నుంచి ట్యూషన్ కి వెళ్లేందుకు నిరాకరించింది. కూతురి ప్రవర్తనతో బిత్తరపోయిన ఆ తండ్రి సైకాలజిస్ట్ కు చూపించగా, ఆమె గది వెతకమని వైద్యుడు వారికి సూచించాడు. కూతురి పుస్తకాలను వెతికిన ఆ తండ్రికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అయ్యింది. తనపై జరిగిన లైంగిక దాడిని ఎవరికీ చెప్పుకోలేని ఆ చిన్నారి వాటిని డ్రాయింగ్ ల రూపంలో తన నోట్ బుక్ లలో గీసుకుంది.

బెడ్ పై చిన్నారి ఓ వ్యక్తిని చూసి బయపడినట్లు, ఇంకో ఫోటోలో అయితే చెప్పుకోలేని ‘భంగిమ’ తో బొమ్మలు గీసి ఉంది. వెంటనే ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో చట్టాలు గట్టిగానే ఉంటాయి కాబట్టి ఆ మానవమృగం తప్పించుకోదనే అనుకోవచ్చు.

Brazil Child Sexual attack

Brazil priest sexual attack on Child

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brazil  Child  Sexually attack  draws pics  Priest arrest  

Other Articles