ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి | TTDP leader Revanth Reddy elected Indian Hockey Federation president

Ttdp leader revanth reddy indian hockey federation president

Revanth Reddy elected as Indian Hockey Federation president, Revanth reddy hockey president, TTDP Revanth Reddy latest news, Revanth Reddy Hockey Federation president, Kodangal MLA for IHF President

TTDP leader Revanth Reddy elected as Indian Hockey Federation president.

రేవంత్ రెడ్డికి అలా జాతీయ స్థాయి గుర్తింపు!

Posted: 10/21/2016 09:01 AM IST
Ttdp leader revanth reddy indian hockey federation president

తెలంగాణ ప్రభుత్వం, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను ముప్పు తిప్పలు పెట్టే టీటీడీపీ ఏకైక అస్త్రం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్లి వచ్చినప్పటికీ గులాబీ బాస్ కి చుక్కలు చూపందే నిద్ర పోననీ మీసం తిప్పి మరీ సవాల్ చేశాడు. మల్లన్న సాగర్ మొదలు ఏ అంశం వదలకుండా టీ సర్కార్ ను ఇరకాటంలో పెడుతూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆయనకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

ఐహెచ్‌ఎఫ్‌ కార్యవర్గం కొత్త అధ్యక్షుడిగా రేవంత్ ను ఎంపిక చేశారు. ఇప్పటికే డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న ఆయన్ని ఢిల్లీలో గురువారం జరిగిన కార్యవర్గ సమావేశంలో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

అయితే దక్షిణాదిలో పెద్దగా ఆదరణకు నోచుకోని హాకీ క్రీడకు జాతీయ అధ్యక్షుడిగా సౌత్ నేతను, పైగా అది తెలుగు వ్యక్తిని ఎంపికచేయటం అభినందనీయం అంటూ రేవంత్‌ రెడ్డిని పలువురు అభినందించటం విశేషం. పలువురు టీడీపీ నేతలు, క్రీడాకారులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTDP leader  Revanth Reddy  IHF president  

Other Articles