జాతీయ గీతం వస్తుంటే కుర్చీలో ఉన్నాడంటూ ఆ రచయితను | wheel chair bound activist salil chaturvedi attacked.

Wheel chair bound activist salil chaturvedi attacked

wheel chair bound activist salil chaturvedi attacked, salil chaturvedi attacked, Writer not standing for National Anthem, Wheel Chair Writer Atatck, Couple attack salil chaturvedi

wheel chair bound activist salil chaturvedi attacked at panaji not-standing national anthem.

దేశభక్తి లేదంటూ ఆ రచయితను పాపం...

Posted: 10/21/2016 08:40 AM IST
Wheel chair bound activist salil chaturvedi attacked

ఇండియన్స్ ఎమోషనల్ ఫుల్స్ అంటూ బ్రిటీష్ వాళ్లు కామెంట్లు చేసినప్పుడు వారిపై మండిపడటం తప్పించి, దానిని సరిచేసుకునే ప్రయత్నం చేయలేదంటూ ప్రముఖ కవి రవీంద్రనాథ్ రాగూర్ తన రచనలో ఓ సందర్భంగా చెప్పుకొస్తాడు. సంతోషం, బాధ, దుఖం ఇలా ఏ ఫీలింగ్ అయినా సరే మనం అస్సలు కొంచెం కూడా కంట్రోల్ చేసుకోలేమని ఆయన అందులో పేర్కొన్నాడు. ముఖ్యంగా దేశభక్తికి సంబంధించిన విషయంలో... దేశానికి ఏం చేశావ్... అన్నది పక్కన బెడితే, అవసరంలేని, చిన్న చిన్న విషయాల్లోనే ఎక్కువ స్పందిస్తామంటూ ఆయన అందులో పేర్కొన్నాడు.

ఆ సంగతి పక్కన పెడితే జాతీయ గీతంను గౌరవించడం ప్రతీ భారతీయుడి ప్రథమ కర్తవ్యం. గతంలో చాలా మంది ప్రముఖులు అవమానించారంటూ తీవ్ర విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇక్కడ ఓ రచయితపై ఇలాగే విమర్శలు రావటం, కాస్త మించి ఆయనపై చేయి చేసుకోవటం కూడా జరిగిపోయాయి. కానీ, అసలు విషయం తెలిసి ఆ తర్వాత వారు బాధపడ్డారు. ఇంతకీ విషయం ఏంటంటే..., ప్రముఖ రచయిత సలిల్ చతుర్వేది వెన్నునొప్పితో వీల్ చైర్ కే పరిమితమయిన విషయం తెలిసిందే. ఆయన అంగవైకల్య ప్రచారకర్త కూడా. గోవా రాజధాని పనాజీలో ఓ మల్టీపెక్స్ లో జరుగుతున్న కార్యక్రమానికి ఆయన హాజరయ్యాడు.

ప్రారంభంలో జాతీయ గీతం ఆలాపన జరుగుతోంది. ఆయన తన వీల్ చైర్ లో కూర్చోనే పాడుతున్నారు. ఇంతలో ఆయన నిలబడలేదంటూ ఒక దంపతుల జంట ఆయనపై మండిపడ్డారు. భర్త ఆయనపై చేయి చేసుకోగా, భార్య ఆయనకేం రోగం నిలుచోవచ్చు కదా అని గట్టిగా ఆరిచి గొల చేసింది. ఇంతలో ఆయన అనారోగ్య సమస్య గురించి కొందరు వివరించటంతో వారు బాధపడ్డారు. ఆయనకు క్షమాపణలు కూడా చెప్పారు.

నేనేక్కడికి కదల్లేను. నా పరిస్థితి తెలీకుండా నాపై గట్టిగా చేయి చేసుకున్నారు. అసలు కొందరు ఇంత అతి దేశభక్తి ఎందుకు ప్రదర్శిస్తారో తెలీదు అంటూ చతుర్వేది ఘటనపై స్పందించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Couple  Attacked  Write salil chaturvedi  national anthem  

Other Articles