ఆవు సింహం మధ్యలో అక్కాచెల్లెలు | Gujarati sisters fight against lion

Gujarati sisters fight against lion

Gujarati sisters fight against lion, Santok Rabari and Maiya, Indian woman with lion, Indian woman fight against lion, Fight with lion in India, Gujarat lion attack woman

Gujarati sisters fight against lion to save their cows.

ఆ అక్కాచెల్లెలకు ఎంత ధైర్యం?

Posted: 10/21/2016 07:51 AM IST
Gujarati sisters fight against lion

ప్రముఖ రచయిత జావేర్చంద్ మేఘాని రాసిన చరణ్ కన్య అనే పద్యం చాలా ఫేమస్. అందులో ఓ 14 ఏళ్ల బాలిక ఒక కట్టెతో తాను ప్రేమగా పెంచుకున్న ఓ దూడను సింహంతో పోరాడి ఎదిరించి మరీ కాపాడుకుంటుంది. ఆ సమయంలో ఆమె చేతిలో ఉంది కేవలం ఒక కట్టె మాత్రం. ఇది కల్పితం మాత్రమే. నిజజీవితంలో అది అస్సలు సాధ్యం కాదనుకుంటున్నారు కదా! ఆగండీ... ఇక్కడ మీకో ఇద్దరు అమ్మాయిలను పరిచయం చేయాలి. అది చదివాక మీరే అభిప్రాయం మార్చేసుకుంటారు.

గిర్‌ అభయారణ్యం సమీపంలోని మెందావాస్ అనే కుగ్రామం. తుల్సిశ్యామ్ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో తరచూ సింహాలు దాడి చేస్తుంటాయి. ఇక అదే ప్రాంతంలో సంతోక్‌ రబరీ (19), మయ్యా (18) అనే ఇద్దరు అక్కాచెల్లెలు నివసిస్తున్నారు. పదేళ్ల క్రితం తండ్రికి పక్షవాతం వచ్చి మంచానికే పరిమితం కావటంతో ఉన్న ఆవులను పోషిస్తూ కుటుంబాన్ని వారే పోషిస్తున్నారు. ఇక అక్టోబర్ 9న ఎప్పటిలాగే ఆ అక్కాచెల్లెళ్లు ఆవులను మేపుకుంటూ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు.

ఇంతలో ఎక్కడి నుంచి ఊడిపడిందో తెలీదుగానీ, ఓ పెద్ద సింహం ఆవుల మందపై పడబోయింది. అయితే తమ జీవనాధారం అయిన ఆ మూగజీవాలను కోల్పోవటం ఇష్టం లేని వారిద్దరు కర్రల సాయంతో సింహానికి-ఆవులకు మధ్యగా నిలిచారు.

తన ముందు అంత ధైర్యంగా నిలబడ్డ ఆ అక్కాచెల్లెళ్లను చూసిన సింహం ఏమనుకుందో ఏమో కానీ...ఆవులను ఏమీ చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయింది. ఇది తెలిసిన గ్రామస్థులు, అటవీ సంరక్షణాధికారులు ఎంత గుండె ధైర్యం అంటూ వారిద్దర్నీ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా పెద్దమ్మాయి సంతోక్ మాట్లాడుతూ, ‘సింహాలకు వెన్ను చూపిస్తే అవి మనపైన దాడిచేస్తాయి, ధైర్యంగా ముఖాముఖి ఎదురుపడితే ఏం చేయకుండా వెళ్లిపోతాయి’ అని చెప్పింది. ఈ ఘటనపై వైల్డ్ లైఫ్ నిపుణులు మాట్లాడుతూ... అవును వారు చెప్పింది నిజం. సాధారణంగా సింహాలకు మనుషులు అంటే భయం. వాటి ముందు భయపడితే అవి మనపై దాడి చేస్తాయి’ అని తెలిపారు. సాధారణంగా సింహాల సంచారం ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రజలకు వాటితో ఎలా మసులుకోవాలో బాగా తెలుస్తుంది అంటూ వివరించారు. ఏది ఏమైనా మహిళలు దుర్భలురని అన్న వారికి ఈ ఘటన గట్టి సమాధానంగా దొరికింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarati sisters  Fight  Lion  Save Cows  

Other Articles