స్మృతికి మరో షాక్.. ఈ ఏడాది కలసిరాలేదా..! Smriti Irani, Sadanand Gowda dropped from inter-state council

Smriti irani dropped from inter state council

Arun Jaitley, DV Sadananda Gowda, Narendra Modi, Prakash Javadekar, Ravi Shankar Prasad, Smriti Irani, sushma swaraj, Inter-State Council, PM Modi

Union Ministers Smriti Irani and DV Sadananda Gowda have been dropped from Inter-State Council, official sources said

పార్లమెంటు అపరకాళికి ఈ ఏడాది కలసిరాలేదా..?!

Posted: 10/20/2016 07:25 PM IST
Smriti irani dropped from inter state council

పార్లమెంటులోలో అపరకాళీలా మారి విపక్షాలను ఒక్క ఉదుటన ఉతికేసీ యావత్ భారత ప్రజల చేత ఔరా అనిపించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఈ ఏడాది చెప్పుకోదగ్గ ఘనత అదే. ఎందుకంటే అంతకుమించి అమె విషయంలో ఏదీ కూడా సవ్యంగా సాగడం లేదు. అమె విద్యార్హతల విషయంలో సుప్రీంకోర్టులో ఊరట లభించన అమెకు ఈ ఏడాదలో వరుస దెబ్బలు తగులుతున్నాయి. అమెకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పదవి నుంచి తప్పించి, చేనేత శాఖా మంత్రిగా బదిలీ చేయడం నుంచి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.

అమెతో పాటు మంత్రిత్వ శాఖ బదిలీని ఎదుర్కోన్న సదానంద గౌడ ఇద్దరికీ ఈ పరిణామాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయం కోసం పనిచేసే అంతర్రాష్ట్ర మండలి నుంచి ఈ ఇద్దరు కేంద్రమంత్రులను తప్పించారు. ప్రధాని మోదీ అధ్యక్షులుగా ఉన్న ఈ మండలిలో కొత్తగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను సభ్యునిగా తీసుకున్నారు. మండలిలో మార్పులుచేర్పులు జరిగాయని తాజాగా విడుదలైన ఓ ఉత్తర్వు ద్వారా తెలుస్తోంది. మండలి స్టాండింగ్‌ కమిటీలో ఎలాంటి మార్పులు లేవు.

న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఇకమీదట కూడా మండలిలో కొనసాగనున్నారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కారం చూపేందుకు 1990 మేలో ప్రధాని అధ్యక్షతన అంతరాష్ట్ర మండలిని ఏర్పాటుచేశారు. ప్రస్తుత మండలిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలు, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు, నితిన్‌ గడ్కరీ, మనోహర్‌ పరీకర్‌ సభ్యులుగా ఉన్నారు. వీరుగాక మరో పదిమంది కేంద్రమంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sadananda Gowda  Smriti Irani  Inter-State Council  Prakash Javadekar  PM Modi  

Other Articles