బాబా రాందేవ్ ఫోన్ చైనాదేగా మరి | baba ramdev using iPhone which made in China

Baba ramdev using iphone which made in china

Baba Ramdev using iPhone, Baba Ramdev china products ban, Ramdev baba using china phone, Ramdev phone made in china, China phone for Baba Ramdev

Baba Ramdev using iPhone which made in China.

రాందేవ్ బాబా ఐఫోన్ పంచ్ పేలింది

Posted: 10/20/2016 03:50 PM IST
Baba ramdev using iphone which made in china

మనం చైనా వస్తువులు కొంటున్నాం. మన దేశంలో సొమ్ము ఆర్జించి, డ్రాగన్ కంట్రీ దాయాది పాక్ కు సాయపడుతోంది. ఉగ్రవాదులకు చేయూతనిస్తోంది. అలాంటప్పుడు వాళ్ల వస్తువులను కొనాల్సిన అవసరం ఏంటి? అందుకే మీరు చైనా వస్తువులను, ఆ దేశం నుంచి వచ్చే ఉత్పత్తులను కొనుగోలు చేయకండి అంటూ బాబా రాందేవ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

పాక్ లో పతంజలి ప్రొడక్ట్స్ గురించి, ఆదాయం గురించి విమర్శలు వచ్చిన నేపథ్యంలో స్పందిస్తూ... తనకు డబ్బు ఆశలేదని, తాను అక్కడి సొమ్ము అక్కడ సంక్షేమ కార్యక్రమాల కోసమే ఖర్చుపెడుతున్నానంటూ వివరించాడు. అదే సమయంలో దయచేసి ఇప్పటి నుం‘చైనా’ వస్తువులను కొనుగోలు చేయటం ఆపేయాలంటూ పిలుపునిచ్చాడు.

అయితే ఇక్కడ అసలు తమాషా ఉంది. మూడు రోజుల క్రితమే బాబా రాందేవ్ తన ట్విట్టర్ అకౌంట్లో చైనా వస్తువుల నిషేధంపై ఓ పిలుపునిచ్చాడు. అది కూడా తన ఐఫోన్ లో... అంతే ఇక సోషల్ మీడియాలో ఆయన్ని ఆడేసుకుంటున్నారు. ఇండియాకు వచ్చే ఐఫోన్స్ గానీ, ఆపిల్ ప్రొడక్ట్స్ గానీ చైనా లోని షెంజెన్ ప్రాంతంలో ఫాక్స్ కాన్ కంపెనీ ద్వారా దిగుమతి అవుతున్నాయి. అంటే చైనాలో తయారయ్యే ఆ వస్తువునే రాందేవ్ బాబా వాడుతున్నాడన్న మాట. ముందు నీతులు చెప్పటం మాని, రాందేవ్ ఆ పని చేస్తే మంచిదని, హరిద్వార్ లో పతాంజలి ఐఫోన్(కంటికి సంబంధించింది అని) ప్లాంట్ ప్రారంభించాలని జోకులు పేలుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baba Ramdev  iPhone  China products ban  

Other Articles