బాలీవుడ్ కండలవీరుడిపై మరోమారు విమర్శల వెల్లువ Salman Khan should be taught a lesson: Shiv Sena

If salman khan loves pakistani artistes he should migrate there

salman khan, salman khan pakistan, salman khan statement, pakistani artists issue, shivsena leader, manisha kayande, mns, pakistani artists, shiv sena,pakistani artists bollywood, fawad khan, bollywood news, indian motion picture producers association, imppa, india news, latest news

Salman Khan entered the ongoing war of words about banning Pakistani artists from the Hindi film industry. He said art and terrorism shouldn’t be mixed and Pakistani artists aren’t terrorists.

బాలీవుడ్ కండలవీరుడిపై మరోమారు విమర్శల వెల్లువ

Posted: 10/01/2016 03:47 PM IST
If salman khan loves pakistani artistes he should migrate there

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై మరోమారు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయన తన అభిమాన లోకంతో పాటు దేశ ప్రజలనుంచి విమర్శలను ఎదుర్కోంటున్నారు. పాకిస్థాన్ కు అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. శివసేన, ఎంఎన్ఎస్ నాయకులు సల్మాన్ మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా శివసేన నాయకురాలు మనీషా కాయండే కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. సల్మాన్ ఖాన్‌కు ఈ విషయంలో పాఠం నేర్పించాలన్నారు. ఆయనకు పాకిస్థానీ నటులంటే అంత ప్రేమ ఉంటే.. ఆయన పాకిస్థాన్‌కు వలస వెళ్లిపోవాలని ఆమె ఘాటుగా విమర్శించారు.

పాక్ నటీనటులు ఉగ్రవాదులు కారని, వాళ్లు ఇక్కడ పనిచేసేందుకు వర్క్ పర్మిట్ వీసా తీసుకుని మరీ వచ్చారని, వాళ్లకు వీసాలు మంజూరు చేసింది కూడా ప్రభుత్వమేనని సల్మాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఇంతకుముందు ఎంఎన్ఎస్ అగ్రనేత అమే ఖోప్కర్ కూడా స్పందించారు. చాలా మంది సమర్థిస్తున్నట్లు పాకిస్థానీ నటుల్లో ఒక్కరు కూడా వర్క్ పర్మిట్లు తీసుకోలేదని, టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి సినిమాల్లో నటిస్తున్నారని, ఇది చట్టవ్యతిరేకమని ఆయన అన్నారు. సల్మాన్ ఓ ట్యూబ్ లైట్

దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని,  ఇప్పటికైతే పాకిస్థానీ నటినటులు కనిపిస్తే దాడులు చేస్తామని.. ఆ సినిమాల నిర్మాణాలను అడ్డుకుంటామని కూడా అమే ఖోప్కర్ చెప్పారు. కాగా నెట్ జనులు కూడా సల్మాన్ ఖాన్ పై తీవ్రంగా స్పందించారు. అక్కడి నటినటులు తీవ్రవాదులు కాదని అయితే భారత్ పై దాడిని వారు ఖండించనూ లేదని ఇదే పెద్ద సమస్య అని కొందరు ట్విట్ చేయగా, అది నేను కాదు నా డ్రైవర్ ఇచ్చిన ఇడియాటిక్ ఐడియా అని గతంలో కారు ప్రమాదాన్ని ఊటంకిస్తూ క్రికెటర్ రవీంద్ర జడేజా అయనపై విమర్శలు గుప్పించారు. ఇక మరోకరు ఆయన కారు తాగింది.. కృష్ణ జింక అత్మహత్యకు పాల్పడింది.. ఆయన ప్రస్తుతం అత్యాచారం జరిగిన మహిళగా భావించవచ్చునంటూ గతంలో ఆయనపై వచ్చిన అభియోగాలన్నింటినీ పేర్కోంటూ విమర్శలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  pakistani artists issue  shivsena leader  manisha kayande  mns  

Other Articles