నేనేం ఏపీ ఎంపీని కాను... నాకు ఇక్కడ సీటు ఇవ్వలేదు | Venkaiah Naidu speech at Tirupati Avagahana Sadassu on Special Package

Venkaiah naidu speech at tirupati avagahana sadassu on special package

Venkaiah Naidu speech at Tirupati Avagahana Sadassu, Venkaiah Naidu says he is not AP representative, Venkaiah Naidu on Speech, venkaiah Naidu felicitated, BJP MP venkaiah Naidu

Venkaiah Naidu speech at Tirupati Avagahana Sadassu on Special Package.

నేనేం ఏపీ నుంచి ఎంపిక కాలేదు: వెంకయ్య నాయుడు

Posted: 10/01/2016 02:48 PM IST
Venkaiah naidu speech at tirupati avagahana sadassu on special package

ఇప్పుడు ప్రజలు(బీజేపీ కార్యకర్తలు) చేస్తున్న సన్మానం తనకు కాదని.. ప్రత్యేక ప్యాకేజీకే పట్టం కడుతున్నారని అంటున్నాడు బీజేపీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. శనివారం తిరుపతిలో జరిగిన సన్మాన కార్యక్రమం అనంతరం అవగాహన సదస్సులో పాల్గొని ప్రసంగిస్తూ... యూపీఏ ప్రభుత్వం ఏపీ విభజనను సహేతుకంగా చేయలేదని, అప్పుడే అన్ని సమస్యలు పరిష్కరించాల్సి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఏపీకి గ‌త ప్ర‌భుత్వం ఎంతో అన్యాయం చేసింది, కానీ, ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం రెవెన్యూ లోటును భ‌ర్తీ చేసేందుకు ప‌చ్చ‌జెండా ఊపింద‌ని చెప్పుకొచ్చాడు.

రాష్ట్రానికి హోదాతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో ఆ స్థాయిలోనే ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపాడు. నాలుగు దశాబ్దాలుగా ఏపీని పట్టించుకోలేని కాంగ్రెస్ ఇప్పుడు త‌మ‌ను విమర్శించడం హాస్యాస్ప‌ద‌మేన‌ని వెంకయ్య అన్నాడు. నెల్లూరు అభివృద్ధి గురించి కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఒక చెందాలంటే ఆ ప్రాంత‌ ఎంపీ పార్లమెంటులో అడ‌గాలి, అది వారి హక్కు. కానీ ఆనాడు క‌ర్ణాట‌క నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపికైన నేను ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాజ్య‌స‌భ‌లో అడిగాను. నాకు ఇక్కడి నుంచి సీటు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నేను వేరే రాష్ట్రం నుంచే రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యాను. అయిన‌ప్ప‌టికీ నేను రాష్ట్రానికి చేసే సేవ‌ మాత్రం కొన‌సాగుతూనే ఉంటుంది’ అని వెంకయ్య వ్యాఖ్యానించాడు.

పోలవరం ఇంకా పూర్తికాలేదని త‌మ ప్ర‌భుత్వం వచ్చిన‌ రెండేళ్లకే త‌మ‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. మ‌రి దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ ఏపీకి ప్ర‌యోజ‌నాల్ని చేకూర్చే పోలవరం ఎందుకు పూర్తి చేయలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోల‌వ‌రానికి అయ్యే మొత్తం ఖ‌ర్చును కేంద్రమే భరిస్తుందని చెప్పారు. విభజన బిల్లులోని అన్ని అంశాలపై ఏపీ మంత్రుల‌తో తాము చర్చిస్తూనే ఉన్నట్లు చెప్పారు. ‘ఐఐటీలు, ఎయిమ్స్ వంటివి చ‌ట్టంలోనే ఉన్నాయి.. మీరేంటి ఇచ్చేది అని అంటున్నారు. చ‌ట్టంలో ఉన్న ఎన్నో అంశాల‌ను గ‌తంలో కాంగ్రెస్ నెర‌వేర్చిందా?..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  AP special Package  Tirupathi  

Other Articles