ట్రంప్ ట్విట్టర్ లో సెక్స్ టేపు వ్యవహారం | Trump tries to distract from Alicia Machado sex tape accusations

Trump tries to distract from alicia machado sex tape accusations

Donald Trump Alicia Machado sex tape, Alicia Machado sex tape, Trump tries to distract from Alicia Machado sex tape, Trump reply to Clinton on Alicia Machado, Alicia Machado about Trump

Donald Trump tries to distract from Alicia Machado sex tape accusations.

ట్రంప్ ట్విట్టర్ లో సెక్స్ టేపు వ్యవహారం

Posted: 10/01/2016 10:17 AM IST
Trump tries to distract from alicia machado sex tape accusations

రాను రాను అధ్యక్ష రేసులో తనపై సానుకూలత తగ్గిపోతుండటం, ఆయన చేసే కంపు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతుండటంతో నిపుణులను పెట్టుకుని మరీ ఎలా మాట్లాడాలో నేర్చుకుంటున్నాడు డోనాల్డ్ ట్రంప్. ఓవైపు అమెరికా అంతా నిద్రపోతున్న వేళ తాను మేల్కుని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ మధ్య జరిగిన మహా డిబెట్ లో ట్రంప్ గత వ్యాఖ్యలను కదిలించి తీవ్ర ఇరకాటంలో పెట్టేసింది ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్. తద్వారా తన ఓటు బ్యాంకు సానుకూలతను పెంచుకోవటంతోపాటు, ట్రంప్ ను దారుణంగా దెబ్బతీసింది. ముఖ్యంగా ఆడాళ్ల పట్ల ట్రంప్ కి గౌరవం లేదంటూ మాజీ సుందరి ఎలిసా మచాదో ఉదంతాన్ని లేవనెత్తింది. ఆమెను పంది అంటూ దూషించిన విషయాలను గుర్తుచేసి పై చేయి సాధించంిది.

అయితే ఈ విషయంలో ట్రంప్ మరోసారి పెద్ద షాక్ ఇచ్చాడు. తెల్లవారుజామున ఎలిసా గతాన్ని ప్రస్తావిస్తూ తన ట్విట్టర్ లో కొన్ని ట్వీట్లు ఉంచాడు. క్రూక్ డ్ హిల్లరీ కి మాజీ విశ్వసుందరి చెండాలమైన గతం తెలీదా? ఒకసారి వెనక్కి వెళ్లితే ఆమె గురించి భయంకరమైన విషయాలు తెలుస్తాయి కదా అంటూ ట్వీట్ తో మొదలుపెట్టాడు. గతంలో ఆమె సెక్స్ టేప్ విడుదలై సంచలనం రేపింది. అలాంటి మహిళను డిబెట్ లో అస్త్రంగా వాడుకున్నారంటూ ట్వీట్స్ చేశాడు. ఈ విషయంలో మీడియా కూడా నిజానిజాలను గ్రహిస్తే మంచిందంటూ పేర్కొన్నాడు.

ఇక 1996 నాటి మిస్ యూనివర్స్ విజేత అయిన ఎలిసా మచాదో సెక్స్ టేప్ ఒకటి లీకై సంచలనం రేపింది. ఆపై కొన్నాళ్లు కనుమరుగు అయిన ఆమె తర్వాత కొన్ని సినిమాల్లో, ఆపై సామాజిక వేత్తగా పని చేసి, చివరికి  రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేశారు కూడా. ట్రంప్ తనను ఎప్పుడూ ఒక చెత్తకుప్పలాగే చూసేవాడని మచాడో మండిపడ్డారు. బిగ్ డిబేట్ అయిన వెంటనే మర్నాడే మీడియా ముందుకు వచ్చారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక పీడకలలా తన గురించి ఆయన చెప్పారని ఆవేదన చెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump Alicia Machado sex tape  

Other Articles