Petrol price increased by 36 paise/litre, diesel decreased by 7 paise/litre

Petrol price raised diesel price cut by 7 paise per litre

Petrol price hike, Diesel price cut, petrol price rise, Petrol in Delhi, Diesel in Delhi, Fuel price

Oil Companies on Friday increased petrol prices by 36 paise per litre and decreased diesel prices by 7 paise per litre. The prices will vary from state to state and will be effective from midnight.

చమురు ధరలు తటస్థం.. అయినా వాహనధారులపై భారం

Posted: 10/01/2016 08:57 AM IST
Petrol price raised diesel price cut by 7 paise per litre

వాహనదారులకు చమురు సంస్థలు దసరా వాయింపులను పెట్టాయి. అయితే భారీగా కాకపోయినా.. జేబులకు చిల్లులు పెట్టే అలవాటు వున్న ఇంధన సంస్థలు పండగ అని కూడా చూడకుండా వాహనదారులకు పర్సులలోని డబ్బను లాగేసుకుంటున్నాయి. ఇప్పటికే పండగ పూట ప్రయాణికుడిని కేంద్ర రైల్వేశాఖ ఓ వైపు నిలువునా దోచేసేందుకు ప్రణాళికలు రచించి సువిధ పేరుతో డబ్బులను లాగేసుకునేందుకు, ఫ్లాట్ ఫాం టిక్కెట్ ధరలను పెంచి ఓ వైపు దోచుకునేందుకు మార్గం సుగమం చేసుకుంటుండగానే మరో వైపు చమరు సంస్థలు కూడా అదే బాట పట్టాయి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తటస్థంగానే వున్నా పండగ పూట ప్రయాణికులు ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలన్న యోచనో ఏమో తెలియదు కానీ, ఇంధన సంస్థలు వానహధారులపై మాత్రం భారాన్ని మోపాయి. పెట్రోలు ధరను స్వల్పంగా పెంచిన కన్సార్టియం, డీజిల్ ధరను తగ్గించింది. లీటరు డీజిల్ పై 0.06 పైసలు తగ్గించిన కన్సార్టియం, లీటరు పెట్రోల్‌ పై 0.28 పైసలు పెంచింది. సవరించిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పెట్రోలియం కన్సార్టియం తెలిపింది. పెరిగిన ధరలు అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles