పాక్ తో యుద్ధానికి ఆమె ఒప్పుకోవటం లేదు | Medha Patkar opined Indus treaty must not be violated

Medha patkar opined indus treaty must not be violated

Medha Patkar opined Indus treaty, Medha Patkar on Indus Treaty, Medha Parkar war against Pak, Medha patker Pak water War, Medha Patker No for Water War, armada Bachao Andolan

Medha Patkar opined Indus treaty must not be violated

పాక్ పై అలాంటి యుద్ధం వద్దంటున్న సామాజికవేత్త

Posted: 10/01/2016 09:23 AM IST
Medha patkar opined indus treaty must not be violated

యూరి ఘటన నేపథ్యంలో భారత్ పై వీలున్న అనివైపుల నుంచి దాడి చేయటం ప్రారంభించింది. ఓ అడుగు ముందుకు వేసి ఉగ్ర మూకను ఏరిపడేసింది కూడా. అదే రీతిలో వీలైనన్నీ మార్గాల్లో పాక్ ను ముప్పుతిప్పలు పెట్టాలని భారత్ యోచిస్తోంది. అందుకే దశాబ్దాల నాటి సింధు జల వనరుల ఒప్పందాన్ని వాడుకుని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది.

అయితే అది సహేతుకమైంది కాదంటున్నారు నర్మదా బచావ్ ఆందోళన్ వ్యవస్థాపక సభ్యురాలు మేధాపాట్కర్. సహజవనరులతో యుద్ధం చేయటం మంచి పద్ధతి కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నదులు యద్ధ క్షేత్రాలు కాదని, సింధు జలాల ఒప్పందం రద్దుకు తాము వ్యతిరేకమని అన్నారు. సింధు జలాల ఒప్పందం రద్దుకు తాము పూర్తి వ్యతిరేకమని ఆమె పేర్కొన్నారు. ఇండస్ ఒప్పందంలో ఏముంది?

జల యుద్ధాలకు తాము అంగీకరించబోమన్నారు. నదులు యుద్ధ క్షేత్రాలు కాదని, వాటిని రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని సూచించారు. నిజానికి దేశ అవసరాల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు ప్రభుత్వాలు చెబుతుంటాయని, కానీ నిజానికి వాటి వల్ల బాగుపడేది మాత్రం వ్యాపార వర్గాలేనని ఆరోపించారు. చిన్నచిన్న డ్యాముల నిర్మాణం వల్లే పేదలకు, పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

మహారాష్ట్రకు చెందిన 61 ఏళ్ల మేధా పాట్కర్ ఎంఏలో సోషల్ వర్క్ కోర్సు చేశారు. మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర ప్రాంతాల్లో గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక వేత్త. గుజరాత్ లోని సర్దార్ సరోవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా, భారీ డ్యామ్ లు వారి(గిరిజన) జీవన విధానానికి ఆటంకాలుగా ఉన్నాయంటూ నర్మదా బచావో ఆందోళన్ అనే సామాజిక ఉద్యమానికి తెరలేపాపి పోరాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Medha Patker  Narmada Bachao Andolan  Indus Treaty  

Other Articles