ఫేక్ ఫోటోలు, వీడియోలపై స్పందించిన ఆర్మీ | Pak TV Images Claiming Indian Casualties Are Morphed and Fake

Pak tv images claiming indian casualties are morphed and fake

Pak TV Images Claiming Indian Casualties, Indian Casualties Are Morphed and Fake, Army on Fake Photos and Videos, Army sources about photos, Army released surgical strike video

Army sources said Pak TV Images Claiming Indian Casualties Are Morphed and Fake.

ఆ ఫోటోలు, వీడియోలు అంతా ఫేక్

Posted: 09/30/2016 03:33 PM IST
Pak tv images claiming indian casualties are morphed and fake

దాదాపు 200 మంది సైనికులు సునిశిత దాడిని విజయవంతంగా పూర్తి చేసి వెనక్కి తిరిగి వచ్చిన సందర్భంలో మన సైన్యాన్ని మట్టుపెట్టినట్లు కథనాలే కాదు, ఏకంగా ఫోటోలు, వీడియోలతో కథనాలు ప్రసారం చేస్తోంది పాక్ మీడియా. ఆ ఫోటోలు ఇప్పుడు మన దేశంలో కూడా వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో త్వరగతిన వ్యాపిస్తున్నాయి. అయితే అవి మన సైన్యంకి చెందినవి కావని ఆర్మీ వర్గాలు కాసేపటి క్రితం ప్రకటించాయి.

భారత్ సైనికులు మృతి చెందినట్లు చూపించే వీడియో క్లిప్ లు, ఫొటోలు కనుక వస్తే వాటిని షేర్ చేయవద్దని భారత్ ఆర్మీ కోరింది. ఈ తరహా వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయని, అదంతా బూటకమని, నమ్మవద్దని నెటిజన్లకు సూచించింది. ఇటువంటి వాటిని ఎవరికీ షేర్ చేయవద్దని, మీడియా కూడా ప్రసారం చేయవద్దని సూచించింది.దాడిలో పాల్గొన్న మన సైనికుల్లో ఎవరికి చిన్న గాయం కూడా కాలేదని స్పష్టం చేసింది.

భారత్ సైన్యం నిర్దేశిత దాడులకు దిమ్మ తిరిగిన పాకిస్థాన్ కు ఏం చెయ్యాలో అర్థం కాక, ఇటువంటి వీడియోలను, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి బూటకపు ప్రచారం చేస్తోందని ఆర్మీ పేర్కొంది. కాగా, ఇంకోవైపు గుట్టలుగా ఉన్న ఫోటోలు పాక్ సైనికుల ఫోటోలపై కూడా స్పందించింది. అయితే అవి కార్గిల్ వార్ లో చనిపోయిన వారివని పేర్కొంది. ఆ సమయంలో పాక్ శవాలను వెనక్కి తీసుకునేందుకు ఒప్పుకోలేదు. అందుకే మన భూభాగంలోనే వాటిని పూడ్చేశామని తెలిపింది. కాబట్టి అలాంటి వాటిని తప్పుడుగా ప్రచారం చేయొద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చింది ఆర్మీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pak Media  Indian Casualities  Surgical strikes  Fake Photos and Videos  

Other Articles