మోదీని చూసి మురిసిపోతున్న రాహుల్ ఎందుకు? | Rahul Gandhi on India's surgical strikes

Rahul gandhi on india s surgical strikes

Rahul Gandhi on India's surgical strikes, Rahul Gandhi congratulate Modi, Rahul Praises Modi, Rahul on India's surgical strikes, After 2 years Modi Proves as PM

Rahul Gandhi on India's surgical strikes congratulate PM Modi.

మోదీపై రాహుల్ చాలా వెరైటీగా స్పందించాడు

Posted: 09/30/2016 03:16 PM IST
Rahul gandhi on india s surgical strikes

ఓవైపు పాక్(ఉగ్రవాదుల) పై మెరుపు దాడి చేసిన మోదీ సర్కార్ ను దేశంలోని నేతలంతా అభినందిస్తున్నారు. మోదీ సర్కార్ కి తామంతా మద్ధతుగా నిలుస్తామంటూ గురువారం అఖిలపక్ష భేటీ అనంతరం జాతీయ నేతలంతా ప్రకటించడం చూశాం. అందులో ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఉన్నారు. దేశమంతా ముక్తకంఠంతో మోదీకి సపోర్ట్ వస్తున్న వేళ కాంగ్ యువరాజు ఏం మాట్లాడతాడా అని అంతా ఎదురు చూస్తుండగా.. స్పందించేశాడు.

ప్రస్తుతం ఉత్త‌రప్ర‌దేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘దియోరియా టూ ఢిల్లీ యాత్ర’ పేరిట 2,500 కిలో మీటర్ల కిసాన్ పాదయాత్రను కొనసాగిస్తున్న రాహుల్ ఈ విషయంపై స్పందించాడు. ‘మోదీకి థ్యాంక్స్. ఎందుకంటే.. రెండున్న‌రేళ్ల‌ క్రితం భార‌త ప్ర‌ధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ చేసిన తొలి మంచి ప‌ని ఇదే’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. అర్జంట్ గా ఆయనతో మాట్లాడాలని ఉంది. అభినందించాలని ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తాను, త‌మ పార్టీ(కాంగ్) పాక్‌పై కేంద్రం తీసుకున్న చ‌ర్య‌కు మ‌ద్ద‌తిస్తుందని, దేశం మొత్తం ఆయన వెనకే ఉంటుందని పేర్కొన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ప‌లుచోట్ల బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హిస్తూ మోదీపై ఎక్కేస్తున్న రాహుల్.. ఈరోజు మాత్రం భిన్నంగా మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు వ్యాఖ్యానించటంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు దేశ మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారి వాజ్ పేయి నాడు చేయలేని పనిని, ప్రధాని నరేంద్ర మోదీ తన హయాంలో చేసి చూపించాడని సోషల్ మీడియాలో అభినందనలు వెలువెత్తుతున్నాయి. 2001లో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో పాక్ ఉగ్రవాదులు మన దేశంలో పలు చోట్ల దాడులకు పాల్పడ్డారు. ఏకంగా, మన దేశ పార్లమెంట్ పైనే దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడి అనంతరం వాజ్ పేయి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించలేదని పలు విమర్శలు వచ్చాయి.

ఇక ఇప్పుడు ప్రస్తుత విషయానికొస్తే, యూరీ సెక్టార్ ఘటన, కాల్పుల విరమణ నిబంధనలను పాక్ ఉల్లంఘించడం వంటి కవ్వింపు చర్యలు చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా వ్యూహాత్మక సహనం పాటించిన భారత్, పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ పర్యవేక్షణలో జరిగిన దాడిలో ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడి, ఉగ్రవాదులను భారత్ సైన్యం మట్టుబెట్టడం తెలిసిన విషయమే. అయితే అదే సమయంలో వాజపేయి హయాంలోనే పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించడం, కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన విషయాన్ని మరవకూడదని మరికొంతమంది అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  PM Modi  Pakistan  Surgical Strikes  

Other Articles