ప్రపంచ అత్యుత్తమ దాడుల్లో భారత్ కొత్త రికార్డు | 10 surgical strikes that rewrote history

10 surgical strikes that rewrote history

India creates history with Surgical attacks, 10 surgical strikes that rewrote history, 10 surgical strikes, top 10 surgical strikes, 4th place of Surgical strike

India surgical strike on Pakistan listed in top attacks.

భారత సర్జికల్ స్ట్రైక్ తో కొత్త రికార్డు

Posted: 09/30/2016 12:54 PM IST
10 surgical strikes that rewrote history

మాటు వేసి మన సైన్యాన్ని పాక్ ఉగ్ర రాక్షసులను భారత్ పంజా పవర్ చూపి సత్తా చాటింది సైన్యం. ఈ క్రమంలో సర్జికల్ స్ట్రైక్స్ (సునిశిత దాడులు) గతంలో జరిగిన వాటిని గుర్తు చేసుకుంటున్నారు మన మాజీ సైనికాధికారులు. చుట్టుపక్కల నష్టం వాటిల్ల కుండా కేవలం లక్ష్యం మాత్రమే నాశనం అయి అయ్యేలా అదే సమయంలో దాడి చేసే వాళ్లకి కూడా డ్యామేజ్ కాకుండా చేయటమే సర్జికల్ స్ట్రైక్స్ ఉద్దేశమన్నది తెలిసిందే.

ఈ సందర్భంగా చరిత్ర సృష్టించిన కొన్ని సర్జికల్ స్ట్రైక్స్ వివరాల్లోకి వెళ్తే...

-1976 జూన్ లో ఉగాండాకు చెందిన హైజాకర్లు ఓ విమానాన్ని హైజాక్ చేసి అందులో పాలస్తీనీయులు, ఇజ్రాయేలీలను బందీలుగా పట్టుకున్నారు. వారిని యూదులు, యూదేతరులుగా రెండు వర్గాలుగా విభజించి, ఇజ్రాయెల్ తో బేరసారాలకు దిగారు. నాలుగు రోజుల చర్చ అనంతరం ఐదోరోజు ప్రణాళికలు రచించిన ఇజ్రాయెల్ కమెండోస్ ఆరోరోజు యుద్ధ హెలికాప్టర్ లో ఉగాండాకు వెళ్లి, హైజాకర్లు, నియంత సైన్యాన్ని మట్టుబెట్టి, బందీలుగా ఉన్నవారిని విడిపించి తమ విమానంలో ఎక్కించుకుని వెనుదిరిగారు. కేవలం 100 మంది కమాండోలు మాత్రమే పాల్గొన్న ఇదే ప్రపంచంలో అత్యుత్తమ సర్జికల్ స్ట్రైక్!

-ఇదే తరహాలో సర్జికల్ స్ట్రయిక్స్ ఇజ్రాయెల్ కొన్ని వందలు చేసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత 1977 అక్టోబర్ 13న మరో విమానాన్ని హైజాక్ చేసిన దుండగులు మొగదిషులో విమానాన్ని దించి బేరసారాలకు దిగినప్పుడు జర్మన్ సేనలు క్షణాల్లో దిగి, వారిని మట్టుబెట్టి బందీలను విడిపించడం ప్రపంచంలో రెండో అత్యుత్తమ సర్జికల్ స్ట్రైక్.

-కాగా, ప్రపంచంలో మూడో అత్యుత్తమ సర్జికల్ స్ట్రైక్, మే 2, 2011 ఒసామా బిన్ లాడెన్ లేపేయటం కోసం. పాకిస్థాన్ ఆర్మీ స్థావరానికి కూత వేటు దూరంలో ఉన్న అబోటాబాద్ లో అమెరికా సేనలు హతమార్చి శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడెయ్యడం ద్వారా సాధించిన విజయం.

-ఇక ఇప్పుడు ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలు సంయుక్తంగా చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్ విజయవంతం కావడంతో 38 మంది పాక్ ఉగ్రవాదులను, వారికి సహకరించిన 2 పాక్ సైనికులను మట్టుబెట్టడంతో, చరిత్రలో నిలిచిపోయేలా నాలుగో సర్జికల్ స్ట్రైక్ భారత్ ఖాతాలో పడిందని మాజీ సైనికాధికారులు చెప్పుకుంటున్నారు.

ఇక మయన్మార్ అటవీ ప్రాంతంలో గతేడాది జూన్ లో భారత్ 70 మంది ఆర్మీ కమాండోస్ తో నిర్వహించిన 40 నిమిషాల సర్జికల్ స్ట్రైక్ లో 38 మంది నాగా మిలిటెంట్లను మట్టికరిపించింది. అంతకు ముందు వారు మన సైన్యంలోని 18 మంది సైనికులను పొట్టనబెట్టుకోవటంతో సైన్యం ఈ ప్రతీకార చర్యకు దిగింది. ఇక బే ఆఫ్ పిగ్స్ ఇన్వెషన్ పేరుతో 1961లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ మరోకటి. ధి బే ఆప్ పిగ్స్ దీవుల నుంచి తమ దేశంలోకి అక్రమ చొరబాటుదారులను నివారించే క్రమంలో అమెరికా సాయంతో క్యూబా నిర్వహించిన ఈ దాడిలో ఫెడల్ కాస్ట్రో ప్రభుత్వం ఘోర నష్టాన్ని చవిచూసింది. 100 మంది పైగా సైనికులు చనిపోగా, 1200 మంది శరణార్థులను ప్రాణాలతో పట్టుకొగలిగారు.

1979 నవంబర్ లో ఇరాన్ ఆపరేషన్ ఈగల్ క్లా, కూడా విషాదంగానే మిగలగా, సోమాలియాలో 1993లో నిర్వహించిన బ్లాక్ హాక్ డాన్ కూడా అదే తీవ్ర నష్టాన్నే మిగిల్చాయి. ఇక ఆపరేషన్ నిఫ్టీ ప్యాకేజీ పేరిట పనామా నిర్వహించిన ఓ ఆపరేషన్ కామెడీగా ముగిసింది. 1989లో యూఎస్ భద్రతా దళాలు పనామా నియంత మాన్యుఎల్ నోరిగా ను పట్టుకునేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించారు. పనామా సిటీలోనే యూఎస్ దళాలకు, పనామా సైన్యానికి భీకర పోరు జరగ్గా, ఆ శబ్ధాలను తట్టుకోలేక నోరిగా లోంగిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 10 surgical strikes  India Pak  4th place  

Other Articles