అమ్మ ఆరోగ్యంపై ఫోటో ఫ్రూఫ్ కావాలంట! | Oppositions demand release Jayallaitha's photo over her illness news.

Oppositions demand release jayallaitha photo

Jayalalitha's Health Condition, Jaya's Health bulletin, Jayalalitha Gossip, Jayalalitha's Health Condition, Jayalalitha Health Rumour, Jayalalitha Health

Oppositions demand release Jayallaitha's photo over her illness.

అమ్మ ఫోటో కావాలంటూ మొండిపట్టు...

Posted: 09/29/2016 05:29 PM IST
Oppositions demand release jayallaitha photo

సినీ నటి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఏమైంది...? ఆమె తీవ్ర అనారోగ్యంతో ఉన్నారా...? ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ కూడా విడుదల చేయకపోవటంతో దేశం మొత్తం ఇప్పుడు అమ్మ ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకుంది. తీవ్ర అస్వస్థతో వారం క్రితం చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆమె చేరిన సంగతి తెలిసిందే. మధ్యలో సింగపూర్ తీసుకెళ్తారన్న వార్తలు వినిపించినప్పటికీ, వైద్యులు ఆ ప్రయత్నాన్ని ఎందుకో విరమింపజేశారు. చివరికి వారం రోజులు దాటి పోవడం, వైద్యులు ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి సమాచారాన్ని ప్రకటించకపోవడంతో జయలలిత ఆరోగ్యం విషమించిందని పుకార్లు వ్యాపించాయి.

ఈ నేపథ్యంలో అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని ఎటువంటి వదంతులను నమ్మవద్దని అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు కోరాయి. కాగా జయలలిత ప్రస్తుతం కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఉన్నారని, శుక్రవారం డిశ్చార్జి అవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆస్పత్రి నుంచే ఆమె అధికారులతో మాట్లాడుతున్నారని చెబుతున్నాయి. వైద్యులు కూడా జయలలితకు జ్వరం లేదని, సాధారణ ఆహారాన్నే తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

జయలలితకు తోడుగా ఆమె ప్రాణస్నేహితురాలు నెచ్చలి శశికళ, బంధువు ఇలవరసి ఆసుపత్రిలోనే ఉన్నారు. తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పన్నీరుసెల్వం మంగళవారం ఆసుపత్రి చేరుకుని అమ్మను పరామర్శించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె ఆరోగ్యంపై వదంతులు సృష్టించే వారి మీద, పుకార్లు చేసేవారి మీద, ఈ విషయంపై కథనాలు ప్రసారం చేసే మీడియాపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు పోలీసు శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా  ప్రతిపక్షనేత పీఎంకేకు చెందిన రామదాస్ మాత్రం జయలలిత ఫొటోను విడుదల చేయాలని డిమాండ్ చేయటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamilnadu  CM Jayalalitha  Health Condition  Photo  Opposition  

Other Articles