38 మంది టెర్రరిస్ట్ లను ఎలా లేపేశారు | India Surgical Strike on Pak killed 38 terrorists

India surgical strike on pak killed 38 terrorists

India Surgical Strike on Pak, 38 terrorists killed in India Surgical Strike, Indai kills 38 Terrorists, India Surgical Strike on Pak, Parrikar Behind Pak Attack

India Surgical Strike on Pak killed 38 terrorists.

48 నిమిషాలు.. 3 కిలో మీటర్లు... 38 మంది ఖతం

Posted: 09/29/2016 04:10 PM IST
India surgical strike on pak killed 38 terrorists

యూరీ ఘటన అనంతరం పాకిస్థాన్ రెచ్చిపోయి క్షణానికో ప్రకటన చేస్తుండడంతో... ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్న ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. మేకపోతు గాంభీర్యంతో గప్పాలు కొడుతున్న పాకిస్థాన్ ను మౌనంగా దెబ్బకొట్టాలని నిర్ణయించింది. బుధవారం రాత్రి ఆకస్మికంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ముష్కర స్థావరాలపై మెరుపుదాడికి దిగింది.

భారత్ పైకి ఉసిగొల్పేందుకు ఐఎస్ఐ, పాక్ ఆర్మీ సన్నాహాలు చేసుకుంటున్నాయని ఉప్పందగానే...భారత సైనికులు అప్రమత్తం అయ్యారు. అసలు సరిహద్దుల ఆవల ఏం జరుగుతోందోనని ఓ కన్నేసి ఉంచిన భారత్ నిఘా వర్గాలకు.. ఆ తీవ్రవాద శిబిరాలు భారత్ కి తరిలే క్రమంలో ఉండగా, ఒక చోట చేరాయన్న పక్కా సమాచారం అందుకున్నాయి. అంతే మెరుపు దాడితో విరుచుకుపడ్డాయి.

ఇండియన్ ఆర్మీ దాడులపై.. నెట్ జనుల అభినందనలు వెల్లువ

వివిధ సెక్టార్లలోని 6 నుంచి 8 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పారా కమాండోస్ ను వినియోగించారు. మొత్తం 4 గంటల్లో ఆపరేషన్ పూర్తికాగా, కేవలం 48 నిమిషాల వ్యవధిలో శత్రుదేశంలోకి మూడు కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి...38 మంది ముష్కరులను మట్టుబెట్టారు. ఏడు టెర్రరిస్టు క్యాంపులను నేలమట్టం చేశారు. ఎంత వేగంగా వెళ్లారో అంతే వేగంగా వెనక్కి వచ్చేశారు. ఏం జరుగుతోందని పాక్ తెలుసుకునేలోపు భారత సేనలు ఆపరేషన్ ముగించి స్వదేశం చేరడం విశేషం.

మృతుల్లో ఉగ్రవాదులతో పాటు వారికి గైడ్లుగా వ్యవహరించే వారు, శిబిర నిర్వాహకులు కూడా ఉన్నారంట. దొడ్డిదారిలో ఎప్పటికప్పుడు దెబ్బతీయడం మీ పని అయితే, మేము కళ్లు తెరిస్తే మీరు తుడిచిపెట్టుకుపోతారన్న బలమైన సందేశాన్ని ఈ దాడితో ఇచ్చినట్లు అయ్యింది. అదే సమయంలో ప్రపంచ దేశాల (ప్రధానంగా చైనా)కు తమ సహనానికి కూడా హద్దుంటుందన్న సూచనలు పంపింది. దీంతో భారత్ లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా, పాక్ లో మాత్రం తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

దాయాధి భూభాగంలోకి చొచ్చుకెళ్లి.. ఇండియన్ ఆర్మీ సునిశిత దాడులు

ఫ్లాన్ వెనుక ఒకే ఒక్కడు:

భారత సైన్యం వేగంగా పాకిస్థాన్ లోపలికి చొచ్చుకుపోవడం... మెరుపుదాడులు నిర్వహించడం... ధీమాగా వెనక్కి రావడం వరకు సర్జికల్ స్ట్రయిక్ ఆపరేషన్ మొత్తం రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కనుసన్నల్లోనే జరిగింది. టార్గెట్ ల ఎంపిక దగ్గర్నుంచి, వాటిపై దాడులు చేయబోయే విధానం, తిరిగి వెనక్కి వచ్చే ప్లాన్.. ఇలా ప్రతీదీ మనోహర్ పారికర్ కు చెప్పే భారత సైన్యం చేసినట్టు తెలిపింది.

భారత త్రివిధ దళాధిపతులతో భేటీ జరిగిన సమయానికే భారత సైన్యం ఏడు ఉగ్రవాద శిబిరాలను ఎంచుకోవడం, అందులోని ఉగ్రవాదులను మట్టుబెట్టడం, వెనుదిరగడం వంటి పూర్తి స్థాయి ప్రణాళికపై మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఫైల్ పారికర్ చేతుల్లో ఉందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో ఉన్నట్టే పాక్ లోకి వెళ్లడం, ఎంచుకున్న ఏడు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడం, 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం.. అంతే వేగంగా వెనుదిరగడం జరిగిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Surgical Strike  Pak  

Other Articles