యాదాద్రి ఫోటోలు | KCR approved Yadadri temple blueprint

Kcr approved yadadri temple blueprint

KCR approved Yadadri temple blueprint, Yadadri Photos, KCR Yadadri 3D pics, Yadadri view Photos, KCR Yadadri, Tadadri Temple

KCR approved Yadadri temple blueprint and happy over 3D photos

యాదాద్రి నమునా ఫోటోలు

Posted: 09/29/2016 03:15 PM IST
Kcr approved yadadri temple blueprint

వచ్చే ఏడాది దసరానాటికి తెలంగాణ తిరుమల క్షేత్రంగా భావిస్తున్న యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది, భక్తుల సందర్శనార్థం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించాడు. ప్రపంచంలోనే ప్రత్యేక నిర్మాణ కౌశలంతో దైవభక్తి ఉట్టిపడే విధంగా పవిత్ర శిల్పకళా నైపుణ్యంతో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దేవస్థానం తుది నమునాకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశాడు కూడా. ప్రధాన ఆలయ సమూదాయాల నిర్మాణం, భక్తులు సేదతీరేందుకు నిర్మించనున్న వివిధ రకాల కాటేజీల నిర్మాణానికి సంబంధించి త్రీడి వీడియో ఫోటోలను ఈ సందర్భంగా కేసీఆర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ బ్లూ ఫ్రింట్ కి ఆమోద ముద్ర వేసేశాడు.

యాదాద్రి దేవస్థాన క్షేత్ర పాలకుడిగా 108 అడుగుల భారీ విగ్రహంతో నిలవనున్న ఆంజనేయ స్వామి పాలరాతి విగ్రహా నమూనాకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇంతటి భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు చైనాకు చెందిన రూపశిల్పులు ముందుకు వచ్చారు. భారీ ఆంజనేయ విగ్రహా నిర్మాణానికి ఆలయ డిజైన్ రూపకర్త, ఆర్ట్ డైరక్టర్ ఆనందసాయి ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సభ్యులు త్వరలో చైనాను సందర్శించనున్నారు. పాలరాతితో తయారు చేసిన మోడల్ ప్రతిమను వారికి అప్పగించి భారీ విగ్రహ రూపకల్పన చేయనున్నారు.

 

Yadadri Temple

yadadri 3d view

Yadadri side view

Yadadri temple

Yadadri Temple KCR

Yadadri gopuram

Yadadri KCR next Dussera

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yadadri Temple  Blue Print  CM KCR  

Other Articles