దాయాధి భూభాగంలోకి చొచ్చుకెళ్లి.. ఇండియన్ ఆర్మీ సునిశిత దాడులు Indian Army commandos cross LoC, conduct surgical strikes in Pakistani territory

Indian army commandos cross loc conduct surgical strikes in pakistani territory

Indian Army, LoC, Pakistani territory, DGMO, attacks on terrorists, surgical strikes, pakistan territory, Ranbir singh

The Indian Army today said it has conducted surgical strikes on terror launch pads across the Line of Control (LoC) in Pakistan, causing significant casualties.

దాయాధి భూభాగంలోకి చొచ్చుకెళ్లి.. ఇండియన్ ఆర్మీ సునిశిత దాడులు

Posted: 09/29/2016 12:57 PM IST
Indian army commandos cross loc conduct surgical strikes in pakistani territory

పొరుగు దేశం దాయధి పాకిస్థాన్ పైకి భారత రక్షణ రంగం చొచ్చుకెళ్లి దాడులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ.. పదే పదే చెప్పినా.. బ్రిడేగియర్ స్థాయి సమావేశాలు, దౌత్య స్థాయిలో సమావేశాలు నిర్వహించినా..పట్టించుకోకుండా కుక్క తోక వంకరా అన్నట్లుగా వ్యవహరిస్తూ.. అక్రమంగా మన దేశంలోకి చోరబాట్లను ప్రోత్సహిస్తూ వస్తున్న పాకిస్తాన్ కు భారతదేశం గుణపాఠం చెప్పింది. పాకిస్థాన్ భూభాగంలోకి చోచ్చుకెళ్లి ఉగ్రవాదులపై దాడులకు పాల్పడింది.

మూడు కిలోమీటర్ల మేర పాక్ భూబాగంలోకి వెళ్లిన భారత బలగాలు అక్కడున్న ఉగ్రవాదులతో పాటు మన దేశంపైకి దండయాత్ర కోసం వినియోగించేందుకు సిద్దంగా వున్న ఉగ్రవాదుల లాంచ్ ఫ్యాడ్లపై సునిశిత దాడులు చేసింది. పాక్ భూభాగంలోనే తాము ఈ దాడులు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ తెలిపారు. పాక్ భూభాగంలో ఉన్న 8 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తదితరులకు దాడుల విషయం గురించి చెప్పారు.

''నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల లాంచ్‌పాడ్లపై భారత సైన్యం గత రాత్రి సునిశిత దాడులు చేసింది. ఈ దాడిలో భారత సైన్యం వైపు నుంచి ఎలాంటి నష్టం సంభవించలేదు. మన భూభాగంలోకి చొరబడాలని కుట్ర పన్నుతున్న ఉగ్రవాదులను మట్టికరిపించడమే ఈ దాడుల ఉద్దేశం. నేను పాకిస్థాన్ డీజీఎంఓకు ఫోన్ చేసి, మన ఆందోళన గురించి చెప్పాను, గత రాత్రి సునిశిత దాడులు చేసినట్లు వివరించాను'' అని లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ మీడియాకు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలకు వాళ్ల భూభాగంలో చోటు ఇవ్వొద్దని ఇన్నాళ్లుగా పదే పదే చెబుతున్నా వాళ్లు మాత్రం దాడులకు పాల్పడుతూనే ఉన్నారని ఆయన అన్నారు. ఇక భారత సైన్యం దాడులకు దేశంలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇది అద్భుతమైన ఆపరేషన్ అని, భారత సైన్యం బాగా స్పందించిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఫాలీ హోమీ మేజర్ అన్నారు.

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ అంటే...

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ (సునిశిత దాడి) అంటే ఒక‌ర‌కంగా యుద్ధ‌మే. శ‌త్రు స్థావ‌రాల‌పై ఎదురుదాడి చేయ‌డం. ప్ర‌పంచ వ్యాప్తంగా మిలిట‌రీ ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హిస్తుంది. మెరుపువేగంతో శ‌త్రు స్థావ‌రాల‌పై దాడి చేసి తిరిగి త‌మ భూభాగానికి వ‌చ్చేయ‌డాన్ని స‌ర్జిక‌ల్ దాడి అంటారు. ఈ దాడిలో ఎంచుకున్న లక్ష్యం మాత్రమే నేలమట్టమవుతుంది. దాని చుట్టూ ఉన్న ఇతర భవనాలు, వాహనాలు, సాధారణ పౌరుల ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా దాడులు నిర్వహిస్తారు. ఈ క్ర‌మంలో త‌మ బ‌ల‌గాలు గాయ‌ప‌డ‌కుండా అద‌న‌పు జాగ్ర‌త్త‌లు కూడా ఆర్మీ తీసుకుంటుంది. ప‌క్కా ప్ర‌ణాళిక‌, లక్ష్యాన్ని క‌చ్చితంగా ఛేదించ‌గ‌ల‌మ‌న్న విశ్వాసం ఉంటేనే ఆర్మీ బ‌ల‌గాలు స‌ర్జిక‌ల్ దాడుల‌కు దిగుతాయి. మ‌న ద‌గ్గ‌ర జూన్‌లో నాగా తిరుగుబాటు దారుల‌పై ఇలాంటి దాడులే నిర్వ‌హించింది ఇండియ‌న్ ఆర్మీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles