హోదా రద్దు భయంతోనే పాక్ మళ్లీ దాడులు... | Modi review meeting on MFN status to Pakistan postponed

Modi review meeting on mfn status to pakistan postponed

Pakistan Army Violates Ceasefire Along Line Of Control, Surgical strikes at LOC

Pakistan Army Violates Ceasefire Along Line Of Control In Kashmir Surgical strikes. Modi review meeting on MFN status to Pakistan postponed

పాక్ కి హోదా విషయంలోనూ పంచ్ పడేనా?

Posted: 09/29/2016 12:24 PM IST
Modi review meeting on mfn status to pakistan postponed

భారత్ వరుస దెబ్బలకు పాక్ కుదేలైపోతుంది. సార్క్ సమావేశం విషయంలో ఇప్పటికే ఒంటరి అయిపోగా, తాజాగా హోదా విషయంలో పాక్ కి గట్టి పంచ్ ఇవ్వాలని భారత్ భావిస్తోంది. పీఎంవో వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్థాన్ కు భారత్ కట్టబెట్టిన అత్యంత సానుకూల దేశం హోదా గుర్తింపు రద్దు వెనక్కి తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగాల్సిన సమీక్షా సమావేశం వాయిదా పడింది. యూరీ దాడిలో 18 మంది జవాన్లను పాక్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

పాకిస్తాన్ కు మన దేశం అత్యంత సానుకూల దేశం హోదాను ఇచ్చినప్పటికీ ఆ దేశం మనకు ఆ హోదాను కట్టబట్టలేదు. ఈ నేపథ్యంలో భారత్ కు సమాంతరంగా ఈ హోదాను ఇవ్వని పాకిస్తాన్ ను ప్రపంచ వాణిజ్య వేదిక (డబ్ల్యూటీవో) ముందు నిలబెట్టాలనే అంశం చర్చకు రావచ్చని తెలుస్తోంది. డబ్ల్యూటీవో నిబంధనల మేరకు సభ్య దేశాల్లో ఓ దేశం మరో దేశానికి ఈ హోదానిస్తే, రెండో దేశం కూడా అదే పని చేయాల్సి ఉంటుంది.

1996లో భారత్ పాకిస్తాన్ కు ఈ హోదాను ప్రకటించగా.... పాకిస్తాన్ 2012లోపు ఈ హోదాను ఇవ్వాల్సి ఉంది. గడువు లోపు ఆ పనిచేయనందున గతంలో మనమిచ్చిన హోదాను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇది అనుకోకుండా వచ్చే వారానికి వాయిదా పడినట్టు అధికార వర్గాలు చెబుతుండటం విశేషం.

ఇక ఓవైపు బహిరంగ మద్ధతు ప్రకటించకపోయినప్పటికీ చైనా చేసే వ్యాఖ్యలు పాక్ కి అనుకూలంగానే ఉంటున్నాయనే విషయం మరోసారి తేటతేల్లమైంది. కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ వాదనకే తాము మద్దతు ఇస్తామని చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి లీ ఝెన్‌మిన్ ప్రకటించడం దీనికి నిదర్శనం.

మళ్లీ పాక్ కాల్పులు...

మరోవైపు భారత్ పై పాకిస్థాన్ దుశ్చర్యలను పలు దేశాలు ఎండగడుతున్న సమయంలో ‘పాక్’ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ పూంఛ్ సెక్టార్ లో కాల్పులకు తెగబడింది. సాజియాన్ ప్రాంతంలో ఉదయం 5.30 గంటలకు మొదలైన ఈ దాడులు భారత ఔట్ పోస్ట్ లు లక్ష్యంగా ఈ కాల్పులకు పాల్పడుతోంది. భారత బలగాలు కూడా దీటుగానే సమాధానం చెబుతున్నాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులకు పట్టుకున్నట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. ఎయిర్ లాంఛ్ లతో ఈ దాడులు జరుగుతున్నట్లు, భారత్ ప్రతిదాడులకు దిగిందని ఆర్మీ కాసేపటి క్రితం మీడియా సమావేశంలో తెలిపింది. 

పాకిస్థాన్, ఉగ్రవాదుల నుంచి తలెత్తే ఎటువంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కునేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని విదేశాంగ ర‌క్ష‌ణ శాఖ, భారత ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మిలిట‌రీ ఆపరేష‌న్స్ (డీజీఎంవో) చీఫ్ ర‌ణ్‌బీర్ సింగ్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. పాక్ మ‌రోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. పాక్ నుంచి చోటుచేసుకున్న చొర‌బాట్ల‌ను ఇప్పటివరకు 20 ప్ర‌దేశాల్లో అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.

నిన్న రాత్రికూడా ఉగ్ర‌వాదుల చొర‌బాటును తిప్పికొట్టినట్లు ర‌ణ్‌బిర్ సింగ్ పేర్కొన్నారు. పాక్ క‌వ్వింపు చ‌ర్య‌లను తాము ఉపేక్షించడంలేదని చెప్పారు. పాక్ ఆర్మీకి చొరబాట్ల అంశాలపై సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఆ దేశం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుందో స‌మాచారం ఇవ్వ‌లేదని పేర్కొన్నారు. కాల్పుల వెనుక ప్ర‌మేయం ఉన్నవారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వని అన్నారు. స‌రిహ‌ద్దుల్లో పాక్ ప‌దే ప‌దే ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతుందని చెప్పారు. ఆ దేశ ఆగడాలను అడ్డుకుని, తిప్పికొట్టేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు తెలిపారు. పీవోకే లో ఉగ్ర‌వాద శిబిరాల‌పై దాడులు నిర్వ‌హించినట్లు చెప్పారు. పాక్ ఆర్మీ తమతో స‌హ‌క‌రిస్తుంద‌ని ఆశించినట్లు తెలిపారు. కానీ అటువైపు నుంచి స్పందన లేదని చెప్పారు.

మరోవైపు సమాచారం అందిన వెంటనే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో మోదీ భేటీ జరుపుతున్నారు. పాకిస్థాన్ త‌న దుస్సాహ‌స‌ చ‌ర్య‌ల‌ను ఆప‌కుండా మ‌రోసారి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన అంశంపై ఆయన సీరియస్ గానే ఉన్నారు.  క‌శ్మీర్ స‌హా అన్ని స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో భద్ర‌త‌పై స‌మీక్ష జ‌రుపుతున్నారు. పాకిస్థాన్‌కు దీటుగా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ మోహ‌రింపుపై కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. భద్రతాపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలను మోదీ సమగ్రస్థాయిలో సమీక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  cease fire  LOC  fire  India  strong reply  

Other Articles