సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్-2029 రైతన్నకు దెబ్బేనా...? | AP CM chandrababu released Sunrise Andhra Pradesh Vision 2029 draft

Ap cm chandrababu released sunrise andhra pradesh vision 2029 draft

Sunrise Andhra Pradesh Vision 2029, Babu new cision for Andhra Pradesh, AP CM chandrababu released Sunrise Andhra Pradesh, Formers ignored in Sunrise AP scheme, Sunrise Andhra Pradesh Vision 2029 draft

AP Chief Minister Chandrababu Naidu unveiled the draft of 'Sunrise Andhra Pradesh Vision 2029' document.

సంతోషాంధ్రప్రదేశ్ చాలా కొత్తగా ఉందే...

Posted: 09/29/2016 09:41 AM IST
Ap cm chandrababu released sunrise andhra pradesh vision 2029 draft

నవ్యాంధ్రను కోసం మరో కొత్త టార్గెట్ సిద్ధమైంది. వచ్చే పదమూడేళ్లలో సంతోషాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కొత్త విజన్ ను ఆవిష్కరించాడు. ‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్-2029’ పేరిట పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూ కొత్త ఫ్లాన్ సిద్ధం చేశాడు. రాష్ట్రాభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలతో కూడిన ‘విజన్-2029’ ముసాయిదాను బుధవారం కలెక్టర్ల సమావేశంలో విడుదల చేశారు.

దీని ప్రకారం ఏపీ సర్కారు 15 ఏళ్లపాటు రెండంకెల వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014-15లో రూ.5.2 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తిని 2029-30కి రూ.28.45 లక్షల కోట్లకు తీసుకెళ్లాలనేది విజన్‌లో ప్రధాన లక్ష్యం. తలసరి ఉత్పత్తిని పెంచడంతో పాటు తలసరి ఆదాయాన్ని కూడా పెంచాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. సర్వీసుల రంగం, వ్యవసాయ రంగం, ఉపాధి, పరిశ్రమ రంగాల్లో వాటాను గణనీయంగా పెంచనున్నారు.

ఇక పరిశ్రమల రంగంలో ఉపాధిని పెంచడం ద్వారా ప్రస్తుతం ఉన్న 18 శాతాన్ని 30 శాతం వరకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అదే సమయంలో వ్యవసాయంపై ఆధారపడేవారిని 40 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని పైకి తీసుకురావడం, ప్రజలకు ప్రాథమిక సౌకర్యాల కల్పన, ప్రజలకు అందుతున్న అన్ని సేవల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని చేర్చడం, ప్రాథమిక అవసరాలు తీర్చి ఆరోగ్య, ఆనందదాయక సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ఇక ఇందులోని ప్రధాన లక్ష్యాలను ఓసారి పరికించి చూస్తే..

- వచ్చే 13 ఏళ్లలో 25 వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు
- మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో 15 లక్షల మందికి ఉపాధి
- 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.97 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం
- రాష్ట్ర తలసరి ఆదాయం రూ.9.61 లక్షలకు పెంచడం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Andhra Pradesh  Sunrise Andhra Pradesh Vision 2029  

Other Articles