లేని రోగం అంటగట్టారు.. 43 ఏళ్లుగా వీల్ చైర్ లోనే...| Misdiagnosis results in Portuguese man spending 43 years in a wheelchair

Misdiagnosis results in portuguese man spending 43 years in a wheelchair

Portuguese man wheelchair Story, Man spending 43 years in wheelchair, Misdiagnosis results man settle in wheelchair, Man in wheel chair for 43 years, 43 years wheel chair, doctors mistake man in wheel chair

Misdiagnosis results in Portuguese man spending 43 years in a wheelchair.

చిన్న తప్పుతో 43 ఏళ్లుగా వీల్ చైర్ లోనే...

Posted: 09/28/2016 01:56 PM IST
Misdiagnosis results in portuguese man spending 43 years in a wheelchair

చిన్న పొరపాటు ఓ వ్యక్తిని 43 ఏళ్లుగా వీల్ చైర్ కే అంకితం చేసి పడేసింది. అలాగని ఓ యాక్సిండెంటో దానికి కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే... అసలు ఏం జరిగిందంటే... పోర్చుగీస్‌కి చెందిన రుఫినో బొర్రె 13 ఏళ్ల వయసుల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా, పరిక్షించిన వైద్యులు రుఫినోకి మస్కులర్ డిస్ట్రోఫీ(కండరాలు చచ్చుపడిపోయాయి) అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. దాని ప్రకారం రుఫినో జీవితాంతం వీల్ చైర్ కే అంకితం కావాలని తేల్చేశారు.

రుఫినో ఇక నడవలేడని తెలియటంతో అతని తల్లిదండ్రులు వీల్ చైర్ లోనే అతన్ని 43 ఏళ్లుగా ఉంచి, సేవలు చేస్తూ వస్తున్నారు. అయితే, 2010లో ఓ ప్ర‌ముఖ‌ న్యూరాలజిస్ట్‌ రుఫినోకి 43 ఏళ్ల క్రితం వైద్యులు ఇచ్చిన‌ రిపోర్టులు చూశాడు. అనుమానం వచ్చిన వైద్యుడు రుఫినోకి మ‌ళ్లీ ఓసారి పరీక్షలు నిర్వహించాడు. అందులో రుఫినోకి మైస్తేనియాగా(కండరాల బలహీనత)తో మాత్ర‌మే బాధ‌ప‌డుతున్నాడ‌ని తేల్చేశాడు. అసలు అతనికి మస్కులర్‌ డిస్ట్రోపీ అనే వ్యాధితో కాద‌ని, ప్రస్తుతం ఉన్న వ్యాధికి చికిత్స కూడా చేయించొచ్చని వివరించాడు.

దీంతో త‌న వ్యాధికి చికిత్స తీసుకున్న త‌రువాత రుఫినో నేలపై కాళ్లు పెట్టి మెల్లిగా న‌డ‌క నేర్చుకున్నాడు. సంవత్స‌రానికి రెండు సార్లు వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్లి సూచ‌న‌లు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రుఫ‌ినో పూర్తిగా కోలుకున్నాడు. మామూలుగా నడుస్తూ అన్ని ప‌నులు చేసుకుంటున్నాడు. ఇక్కడో హైలెట్ ట్విస్ట్ కూడా ఉందండోయ్... 1960లో వైద్యులు చెప్పినట్లు మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి వైద్యశాస్త్రంలోనే లేద‌ట‌. మొత్తానికి నాలుగు దశాబ్దాల తర్వాత నడక నేర్చుకుని (56 వయసులో) తిరిగి మాములు జీవితం ఆరంభించిన రుఫినో, తనను వీల్‌చైర్ కే ప‌రిమితం చేయాలని చూసిన ఆసుప‌త్రిపై త్వరలో కేసు పెట్టబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Portuguese man  spent  43 years  wheel chair  Misdiagnosis  

Other Articles