విద్య కోసం ఒళ్లు అమ్ముకుంటున్న యువతి | woman auctions her virginity online in order to raise money to study abroad

Woman auctions her virginity online in order to raise money to study abroad

Russian Girl Ariana auctions her virginity, Woman auctions her virginity online, Virginity for raise money to study abroad, Russian Girl Ariana Post, Bizzare post in online, Teen ready for sale virginity For Studies

Russian Girl Ariana auctions her virginity online in order to raise money to study abroad.

పై చదువుల కోసం యువతి ఛీ..ఛీ...

Posted: 09/28/2016 10:25 AM IST
Woman auctions her virginity online in order to raise money to study abroad

రష్యా ఆన్ లైన్ సైట్లో ఓ యువతి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. 20 ఏళ్ల యువతి అర్థ నగ్నంగా కేవలం ఇన్నర్స్ తో తన శీలాన్ని అమ్ముతున్నట్లు జారీ చేసిన ప్రకటనపై విమర్శలు వినిపిస్తున్నాయి. కారణం చెబుతూ మరీ ఒళ్లు అమ్ముకునేందుకు సిద్ధపడిన యువతి గాథ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతోంది. రష్యాకు చెందిన 20 ఏళ్ల అరియానా అనే యువతి 1,35,000 పౌండ్లకు తన కన్యత్వాన్ని అమ్ముతున్నట్లు ఆన్ లైన్ లో పెట్టేసింది.

డబ్బు సంపాదించేందుకు తన ముందు వేరే మార్గాలు లేకపోవటంతో, త్వరగతిన సొమ్ము వచ్చే మార్గం కావటంతో తానీ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె చెబుతోంది. తనలాగే చాలా మంది విద్యార్థులకు ఇలాంటి సమస్య ఉందని, అయితే మిగతా వారిలా తాను కుంగిపోకుండా డబ్బోచ్చే సులువైన మార్గాన్ని ఎంచుకున్నానంటూ చెబుతోంది.

విదేశాల్లో చదువు చాలా ఖర్చుతో కూడుకుంది. ఉండటానికి అద్దె కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా వారిని, సొంత ప్రాంతాన్ని వదిలి వేరే దగ్గర ఒంటరిగా జీవించడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. అయినా హద్దులు చేరిపేసి ఈ పని చేస్తున్నా అంతా చదువు కోసమే అని చెబుతోంది. అయితే తాను చేసే ఈ పనులేవీ ఆమె పేరెంట్స్ కి తెలియవంట. వారికి ఎలా నచ్చచెప్పుకోవాలో నాకు బాగా తెలుసు... అయినా ఇప్పుడున్న జనరేషన్ లో ఆన్ లైన్ లో ఏం జరుగుతుందో వారికి తెలియందీ కాదు అంటుందామె.

కన్యత్వం నా హక్కు, అలాగని డబ్బు కోసం వెయిట్ చేయటం నా వల్ల కాదు. కన్యత్వం నా హక్కు. దాన్ని ఏం చేసుకోవాలన్న నా చేతుల్లోనే ఉంటుంది. ఎవడో ఒకడు జీవితంలోకి వచ్చి, వాడికి సమస్తం అర్పించి, చివరకు వాడు గుండెకు గాయం చేసి వెళ్లేదాకా ఎందుకు ఎదురు చూడాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని వివరించింది అరియానా. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russian Girl  Ariana  auctions  her virginity  Online  Abroad Studies  

Other Articles